
నకరికల్లు, (జనస్వరం) : జగన్ ఆదేశిస్తే పవన్ కల్యాణ్ పై పోటీకి సిద్దమన్న వైసీపీ నాయకులు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారులు అలీ మాటలు బాధించాయని జనసేన పార్టీ మండల వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ అలీ స్థాయి మించి మాట్లాడటం సరికాదని, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పట్ల ఎంతో ఆరాధన, అభిమానం చూపిన మీకు జనసైనికులు కూడా మిమ్మల్ని ఆదరించారు. ఇప్పుడు వైసీపీలో చేరి పవన్ కళ్యాణ్ పై పోటీ చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని, పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధ్యక్షులు జగన్ పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. స్థాయికి మించి కామెడీ డైలాగులు మాట్లాడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.