ఏపీలో ఎస్ఐ నియామకాలకు (AP SI Jobs) సంబంధించిన దేహదారుఢ్య పరీక్షలను ప్రస్తుతం నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. అయితే.. వర్షాల నేపథ్యంలో అధికారులు కీలక ప్రకటన చేశారు. గూంటూరు రేంజ్ లో ఆగస్టు 25న జరగాల్సి ఉన్న పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. వర్షాలతో గ్రౌండ్ సిద్ధంగా లేకపోవడం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 25న జరగాల్సి ఉన్న ఈవెంట్స్ ను సెప్టెంబర్ 16కు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఐజీ పాల్ రాజ్ ప్రకటన విడుదల చేశారు. ఇతర తేదీల్లో జరగాల్సిన దేహదారుఢ్య పరీక్షల షెడ్యూల్ లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు https://slprb.ap.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించాలని అధికారులు సూచించారు.
జాబ్స్ .. దరఖాస్తుకు ఎల్లుండి వరకే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి
ఇదిలా ఉంటే.. ఏపీలో ఎస్ఐ నియామక ప్రక్రియకు సంబంధించి ఈ రోజు అంటే.. ఈనెల 25వ తేదీ ఉదయం నుంచి అభ్యర్థులకు ఫిజికల్ మెజర్మెంట్ పరీక్ష (పీఎంటీ), ఫిజికల్ ఎఫీషియన్స్ పరీక్షలు నిర్వ హించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఏపీలో మొత్తం 411 ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి నియామక ప్రక్రియను ప్రారంభించగా.. ఫిబ్రవరి 19న వారికి ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు.
ఈ నియామక పరీక్షకు మొత్తం 1,51,288 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 56,111 మంది దేహదారుఢ్య పరీక్షలకు ఎంపికయ్యారు. దేహదారుభ్య పరీక్షల్లో అర్హత సాధించిన వారికి ఫైనల్ ఎగ్జామ్ ఎంటుంది. అందులోనూ సత్తా చాటిన వారికి ఎస్ఐ ఉద్యోగం లభిస్తుంది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com