అనంతపురం ( జనస్వరం ) : రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అనంత పర్యటనకు విచ్చేసిన సందర్భంగా ఆలమూరు జగనన్న కాలనీ మినహా మరొక కాలనీలో పర్యటించలేదు. నగర సమీపంలోని కొడిమి, ఉప్పరపల్లి, బుక్కరాయసముద్రం, చిన్మయ నగర్ కాలనీల పరిస్థితి ఏమిటో మంత్రి జోగి రమేష్ సమాధానం చెప్పి తీరాలని జనసేన జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మంత్రి జోగి రమేష్ గృహ నిర్మాణాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని జనసేన డిమాండ్ చేస్తుంటే.. అందుకు సమాధానం చెప్పేందుకు చేతకాక ప్రజల దృష్టిని మరలచేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అన్నారు. పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు జిల్లా అధ్యక్షులు టిసి వరుణ్ ఆధ్వర్యంలో ప్రతి గృహ లబ్ధిదారునికి న్యాయం జరిగే వరకు జనసేన పోరాటం చేస్తుందని ఈశ్వర్ స్పష్టం చేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com