ఆలూరు ( జనస్వరం ) : హొళగుంద మండలంలోని M.D హళ్లి (కొత్తూరు) గ్రామంలో పర్యటించి పెద్దలతో మరియు సర్పంచ్ తో ఆలూరు జనసేన ఇంచార్జ్ తెర్నేకల్ వెంకప్ప మాట్లాడటం జరిగింది. గ్రామంలో అంగన్వాడి కేంద్రం శిథిలావస్థకు చేరుకుంది, వర్షం పడినప్పుడు నీరు చేరడంతో చిన్నారులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎస్సీ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అద్వానంగా ఉంది, సమస్యను పరిష్కరించాలంటే సుమారుగా 10 లక్షల రూపాయలు నిధులు కావాల్సి ఉంది, కానీ పంచాయితీ కి సంబంధించి నిధుల కొరతతో డ్రైనేజీ సమస్యను పరిష్కరించలేకున్నాం అని సర్పంచ్ అంటున్నారు. గ్రామంలో ప్రధాన రహదారులపై ఎటు చూసినా బురద, వర్షపు నీరు మయమే, సీసీ రోడ్డు నిర్మాణానికి నోచుకోలేకపోయింది. హెబ్బటం నుండి ఇంగలదాహాల్ మీదుగా పెద్దహరివాణం ప్రధాన రహదారిపై ప్రయాణించాలంటే వర్షం వస్తే ఆ రోజు హాలిడే, M.D హళ్లి మరియు ఇంగలదాహాల్ గ్రామాలమధ్యగల వాగుపై బ్రిడ్జి నిర్మించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అశోక్, అరవింద్, వీరేష్, నందు, ఖలీల్, బడేసాబ్, ఓంకార్, హనుమంత్ మరియు జనసేన కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com