Logo
Date of Publish : 19 March 2023, 3:16 pm
Editor : Sake Naresh

గ్రామాలను గాలికి వదిలేసిన గాలి ప్రభుత్వం : ఆలూరు జనసేన ఇంచార్జ్ తెర్నేకల్ వెంకప్ప

         ఆలూరు ( జనస్వరం ) : హొళగుంద మండలంలోని M.D హళ్లి (కొత్తూరు) గ్రామంలో పర్యటించి పెద్దలతో మరియు సర్పంచ్ తో ఆలూరు జనసేన ఇంచార్జ్ తెర్నేకల్ వెంకప్ప మాట్లాడటం జరిగింది. గ్రామంలో అంగన్వాడి కేంద్రం శిథిలావస్థకు చేరుకుంది, వర్షం పడినప్పుడు నీరు చేరడంతో చిన్నారులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎస్సీ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అద్వానంగా ఉంది, సమస్యను పరిష్కరించాలంటే సుమారుగా 10 లక్షల రూపాయలు నిధులు కావాల్సి ఉంది, కానీ పంచాయితీ కి సంబంధించి నిధుల కొరతతో డ్రైనేజీ సమస్యను పరిష్కరించలేకున్నాం అని సర్పంచ్ అంటున్నారు. గ్రామంలో ప్రధాన రహదారులపై ఎటు చూసినా బురద, వర్షపు నీరు మయమే, సీసీ రోడ్డు నిర్మాణానికి నోచుకోలేకపోయింది. హెబ్బటం నుండి ఇంగలదాహాల్ మీదుగా పెద్దహరివాణం ప్రధాన రహదారిపై ప్రయాణించాలంటే వర్షం వస్తే ఆ రోజు హాలిడే, M.D హళ్లి మరియు ఇంగలదాహాల్ గ్రామాలమధ్యగల వాగుపై బ్రిడ్జి నిర్మించాలని ఆయన కోరారు.  ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అశోక్, అరవింద్, వీరేష్, నందు, ఖలీల్, బడేసాబ్, ఓంకార్, హనుమంత్ మరియు జనసేన కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com