
- 5 లక్షల పేద సామాన్య మధ్య తరగతి విద్యార్థులకు ఉచిత విద్యకు మంగళంపాడెందుకు ఎయిడెడ్ రద్దు
- నారాయణ చైతన్య సంస్థల దగ్గర 1000 కోట్లు ముడుపులు పుచ్చుకుని ఎయిడెడ్ రద్దుకు సన్నద్ధమైన సీఎం జగన్
- సీఎం జగన్ పాలనలో గుడి మీద - బడులు మీద దాడులు
- 120 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎస్ కె పి వి వి హిందూ హైస్కూల్ ను కొనసాగించాలి
విజయవాడ, (జనస్వరం) : వన్ టౌన్ ఎస్ కె పి వి హిందూ హై స్కూల్ వద్ద ఎయిడెడ్ విద్యావ్యవస్థను కొనసాగించాలని, 120 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎస్ కె పి వి వి హిందూ హై స్కూల్ కు ఎయిడెడ్ కొనసాగించాలని జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్ కె పి వి హిందూ హైస్కూల్ విద్యార్థులు జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎస్ కె పి వి హిందూ హై స్కూల్ విద్యార్థులు అమ్మ ఒడి వద్దు మా బడి మాకు ముద్దు, ఎయిడెడ్ విద్యా వ్యవస్థను కొనసాగించాలని, సీఎం జగన్ మంచి మామ కాదు ముంచే మామ కంసా మామ అని నినా దించారు. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ ఎయిడెడ్ విద్యా వ్యవస్థను కొనసాగించాలని, జీవో నెంబర్ 42 & 50 రద్దు చేయాలని, ఎయిడెడ్ విద్య వ్యవస్థను రద్దు చేయడం వలన రాష్ట్రంలో ఐదు లక్షల మంది పేద సామాన్య మధ్యతరగతి విద్యార్థులకు ఉచిత విద్యను దూరం చేసే కుట్రలో భాగంతో పాటు లక్షల కోట్ల రూపాయల విలువైన ఈ స్కూల్ కళాశాల స్థలాలు ఆస్తులను బ్యాంకులో తాకట్టు పెట్టి అప్పులు తేవాలని చూస్తున్నారని, నారాయణ చైతన్య విద్యాసంస్థలు ప్రోత్సహించి పేదలకు ఉచిత విద్యను దూరం చేయాలని అందుకు ఈ ప్రైవేటు విద్యాసంస్థల నుంచి వెయ్యి కోట్ల రూపాయలు ముడుపులను సీఎం జగన్ తీసుకున్నారన్నారు. ఎయిడెడ్ పాఠశాలలు రద్దు చేయడం వలన మధ్యాహ్న భోజన పథకం రద్దుతో పాటు జగనన్న స్కూల్ కిట్ ఎన్ఎస్ఎస్ ఎన్సిసి వంటివి ఈ విద్యార్థులకు దూరమవుతాయని, మెగా డీఎస్సీ ఎందుకు నిర్వహించడం లేదన్నారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 700 స్కూల్స్ & కళాశాల యాజమాన్యం ఎయిడెడ్ కొనసాగించాలని కోరుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. ఉద్యమిస్తున్న స్కూల్ పిల్లల పై పోలీసులతో లాఠీచార్జి చేయించడం చాలా దుర్మార్గమని, ఇలాంటి పాలన గనుక ఆపకపోతే పెద్ద ఎత్తున విద్యార్థులు తాడేపల్లి ప్యాలెస్ ను ముట్టడించి జగన్ రెడ్డికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పశ్చిమ నియోజకవర్గంలో 10 వేల మంది విద్యార్థులు ఉచిత విద్యకు దూరమవుతున్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించడంలేదని, 120 సంవత్సరాల చరిత్ర కలిగిన హిందూ హైస్కూల్ తో పాటు, రాజా హై స్కూల్ తేలప్రోలు బాపనయ్య హై స్కూల్, గుజరాతి, రాజస్థానీ, ఆర్ సి ఎం, జై కిసాన్ వంటి విద్యా సంస్థలు మూత పడుతున్న మంత్రి మౌనంగా ఉంటే పేద వర్గాలకు తీవ్రమైన అన్యాయం చేయడమేనని, ఇటువంటి పనికిమాలిన అసమర్థ దద్దమ్మ ప్రజాప్రతినిధికి ఎందుకు ఓట్లు వేశామని, పశ్చిమ నియోజకవర్గ ప్రజలు బాధపడుతున్నారని, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే జగన్ రెడ్డికి పేద ప్రజలు పడే బాధలను ఎయిడెడ్ విద్యావ్యవస్థ మూసివేస్తే ఉచిత విద్యకు దూరం అవుతారని అంశాన్ని తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్ విద్యావ్యవస్థ ను కొనసాగించకపోతే రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థి నాయకులను పోలీస్ వారు నిరసన మధ్యలో అక్రమ అరెస్టులుకు ప్రయత్నిస్తే వెంటనే నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ తో పాటు జనసేన పార్టీ నాయకులు అడ్డుకుని తిరిగి వారిని వెనక్కి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు, రాజా నాయుడు, మారుపిళ్ళ చిన్నారావు, ఎస్ కె అజాస్ (పండు), నలిబిల్ల కనకారావు, సిరాం శ్రీనుబాబు, కొరకుల సురేష్, అనంతపురం రాజేష్ రామిశెట్టి మురళి, అఖిల్, దేవ్ కృష్ణ, కార్తీక్ సోమి మహేష్, బండి కోమలి, సిగ్ననమ్ శెట్టి రాము, నాగోతి సాయి, చోక్కర నగేష్, జనసేన నాయకులు వెన్నా శివ శంకర్, సోమనాథం, మోబిన, విజయలక్ష్మి, సౌజన్య, వెంకటరమణ, శనివారపు శివ, తదితరులు పాల్గొన్నారు.