
శ్రీకాకుళం జిల్లా జీడి రైతాంగ సమస్యల సాధన సంఘం ఆధ్వర్యంలో పలాస కాశీబుగ్గ మహాత్మ గాంధీ గారి విగ్రహం వద్ద నిరసన దీక్ష కర్యక్రమానికి జనసేన పార్టీ తరపున హరీష్ కుమార్, శ్రీకాంత్ హాజరు అయ్యి వారికీ పూర్తి మద్దతు తెలిపారు. ఇంత గొంతు చించుకుని రైతులు మద్దతు ధర అడుగుతుంటే వ్యవశాయి మంత్రి కన్నా బాబు గారు కనీసం స్పందించకపోవడం దౌరణం అని అసలు ఈ సమస్య ఒకటి వుంది అని మన వ్యవసాయ మంత్రి గారికి తెలుసునా అని జీడి రైతులు కోసం అన్ని పక్షాలు ఏకమై ప్రభుత్వం పై ఒత్తడి తీసుకు రావాలి అని ఈ సందర్భంగా అన్నారు. హాజరయిన ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే. మోహన్ రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.