అమలాపురం, (జనస్వరం) : అగ్నికుల క్షత్రియుల సమస్యలు పరిష్కరించాలంటూ అమలాపురం జనసేనపార్టీ ఇంఛార్జ్ శెట్టిబత్తుల రాజబాబు ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమలాపురం నియోజకవర్గంలో తరచు వరద ముంపుకు గురవుతున్న బోడసకుర్రు, రెబ్బనపల్లి, ఓడలరేవు, వాసాలతిప్ప తదితర అగ్నికులక్షత్రియులు నివసించే ప్రాంతాలలో శాశ్వత ప్రాతిపదికన వరద ముంపు నివారణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అలాగే తరచు వరదలకు గురవుతున్న అగ్నికుల క్షత్రియ ప్రాంతాలలో పక్కా ఇళ్ళు నిర్మించాలి. దానితోపాటు అర్హులైన వారు అందరికీ కూడా ఇళ్ళు నిర్మించాలని తెలిపారు. వరద నివారణకు, ఏటిగట్లు పటిష్టం చేయడం, రివిట్మెంట్లు, సముద్ర తీర ప్రాంత గ్రామాలలో ముంపు నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే ఓ.ఎన్.జి.సి, గెయిల్, కెయిర్న్, వేదాంతా వంటి ఆయిల్ సంస్థల వలన సముద్రజలాలు కలుషితమై, మత్స్య సంపద హరించుకు పోయి, జీవన భృతి కోల్పోతున్న అగ్నికుల క్షత్రియ కుటుంబాలకు, ఒక్కోకుటుంబానికి నెలకు 10 వేల రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం అందించాలి. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లును తెలపడం జరిగింది.
● సముద్రంలో వేట విరామం సమయంలో ప్రతీ అగ్నికులక్షత్రియ కుటుంబానికి నెలకు 10 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలి.
● మర పడవలు, ఇంజన్ నావలతో వేటకు వెళ్లి జీవనోపాధి కొనసాగించే వారికి డీజిల్ పై సబ్సిడీ ఇవ్వాలి.
● అగ్నికులక్షత్రియ యువతకు చేపల వేటలో ఆధునిక నైపుణ్యతలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలి.
● ప్రతీ అగ్నికులక్షత్రియ గ్రామానికి, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలి.
● అగ్నికుల క్షత్రియుల విద్యాభివృద్ధికి రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలి.
● ఇన్ ల్యాండ్ ఫిషర్ మేన్ కో-ఆపరేటివ్ సొసైటీలు పునరుద్ధరించి, గ్రామాలలో చెరువులు, కాలువలు, గుంటలలో మత్స్య సంపద వేటకు అగ్నికుల క్షత్రియులకు పూర్తిస్థాయిలో హక్కులు కల్పించాలి.
● ఓ.ఎన్.జి.సి, గెయిల్,కెయిర్న్ వేదాంతా వంటి ఆయిల్ ఉత్పత్తి చేసే సంస్థలు ఉత్పత్తి చేసే ప్రాంతాలలోని స్థానిక యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.
ఈ సందర్భంగా అగ్నికులక్షత్రియుల జీవన భద్రత కోసం జనసేనపార్టీ ఆధ్వర్యంలో గడియారస్థంభం సెంటర్ నుండి డా.బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమజిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, పి ఏ సి సభ్యులు పంతం నానాజీ, మత్యకర అభ్యునతి కమిటీ చర్మన్ బొమ్మిడి నాయకర్, రాజానగరం ఇంచార్జ్ మేడా గురు దత్త ప్రసాద్, పెద్దాపురం ఇంచార్జ్ తుమ్మల బాబు, అమలాపురం ఇంచార్జి శెట్టిబత్తుల రాజబాబు కలిసి కలెక్టర్ కి విజ్ఞాపనపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, జనసేనపార్టీ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు, అగ్నికుల క్షత్రియులు పాల్గొన్నారు.