Logo
Date of Publish : 03 May 2022, 3:36 pm
Editor : Sake Naresh

యువత వలసల వలన రాష్ట్రంలో వృద్ధాప్య ఛాయలు పరచుకుంటున్నాయి : దారం అనిత

          మదనపల్లి ( జనస్వరం ) : మెరుగైన ఉపాధి లేక యువత ఇతర రాష్ట్రాలు, దేశాలకు వెళ్ళిపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ లో వయస్సు మళ్లిన వారే ఎక్కువగా ఉన్నారని చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత ఒక ప్రకటనలో అన్నారు.  ఆమె మాట్లాడుతూ మరో రెండు మూడు దశాబ్దాల్లో వృద్ధులు రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవుతుందన్నారు. రాష్ట్రంలోని సామాజిక ఆర్థిక పరిస్థితిని గమనిస్తే ఇదే జరగబోతుందని అర్థమవుతుందన్నారు. మంచి స్కూలు, మంచి ఆసుపత్రి, ఉపాధి కల్పించే పరిశ్రమలు ఐటీ లేకపోవడంతో మెరుగైన ఉపాధి జీవనం కోసం యువత ఇతర రాష్ట్రాలకు దేశాలకు వెళ్లి పోతున్నారన్నారు... స్థిరపడుతున్నారు. దీని వల్ల రాష్ట్రంలో యువత క్రమంగా తగ్గుతున్నది. యువత తగ్గిపోయి పెద్ద తరమే ఇక్కడ మిగిలితే ఉత్పాదకత తగ్గిపోతుందని, సంపాదించే వాళ్ళు లేక డబ్బు చలామణి లేక ఆర్థికంగా రాష్ట్రం వెనుకబడి ఉండిపోతుందన్నారు. పల్లెటూర్లలో ఉత్పత్తి కేంద్రాలుగా మార్చి పరిశ్రమని పెట్టుబడిని ఆకర్షించి మెరుగైన ఉపాధి అవకాశాలు వచ్చేలా చేస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని, మరియు కొనుగోలు శక్తి ఉంటుందన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై తేరుకొని అందుకు తగ్గ వనరులను సృష్టించాలని లేదంటే మరో శ్రీలంక దేశంలా మన రాష్ట్రం ఉండిపోతున్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com