Logo
Date of Publish : 20 June 2022, 4:52 pm
Editor : Sake Naresh

పునరావాసానికి ఏళ్లు గడుస్తున్నా నిర్వాసితులకు న్యాయం జరగలేదు : చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత

     చిత్తూరు, (జనస్వరం) : హంద్రీనీవా కాలువకు శ్రీనివాసపురం, తాడేపల్లి జలాశయాలతో పాటు గుంటి వారి పల్లె, మదనపల్లె మండలంలో నిర్మించిన కాలువ వల్ల నివాసాలు కోల్పోయిన నిర్వాసితులు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గుంటి వారి పల్లె గ్రామాలకు చెందిన 33 మంది నిర్వాసితులు 2012 నుండి తమకు న్యాయం చేయాలని పోరాడుతున్నారు. వీరికి 4.50 కోట్లతో అన్ని వసతులు కల్పించాల్సి ఉండగా ఇంత వరకు వీరికి ఎలాంటి సాయం అందలేదు, కల్పించలేదు. దీనిని సాధించుకోవడానికి నిర్వాసితులు ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అయితే అధికారులు మాత్రం వీరికి ఈ ప్యాకేజీ మంజూరు కాలేదని చెబుతుండగా మంజూరైనట్లు తమ వద్ద ఉన్నాయని నిర్వాసితులు చెబుతున్నారు. వేసవి జలాశయం నిర్మాణంలో గుత్తి వారి పల్లి ముంపునకు గురవుతుందని ఇళ్లను ఖాళీ చేసి వెళ్తే ఆర్ అండ్ బి ప్యాకేజీ కింద అన్ని వసతులతో ఇళ్లు కట్టిస్తామని అధికారులు చెప్పారు. దీనికి సంబంధిం శ్వేత పత్రం కూడా ఇచ్చారు. ఆర్ అండ్ బి ఆర్ ప్యాకేజీ కింద అమలు చేయాలని 2012 నుండి నిర్వాసితులు పోరాడుతున్నారు. పలుసార్లు అధికారులకు అర్జీలు ఇచ్చిన న్యాయం జరగలేదని నిర్వాసితులు వాపోతున్నారు. వెంటనే వీరికి న్యాయం జరగాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామని చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com