
ధర్మవరం ( జనస్వరం ) : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపడుతున్న వారాహి యాత్ర ఈనెల 14న చేపట్టినట్టు న్నట్లు ప్రకటించగానే వైసిపి మంత్రులు, ప్రజా ప్రతినిధుల గుండెల్లో రైళ్లుపరిగెత్తుతున్నాయని జనసేన పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తను నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను ఈనెల14నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి వారాహియాత్రను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించగానే అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ప్రజాప్రతినిధులు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయన్నారు. పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర అనంతరం అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలే అంతిమయాత్ర నిర్వహిస్తారన్నారు. ఈనెల 14 నుంచి ఉభయ గోదావరి జిల్లాలో ప్రారంభమై వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తారన్నారు. వారాహి యాత్రకు పత్తిపాడుతో పాటు, రాజోలు నియోజకవర్గానికి తనపై నమ్మకంతో ఇన్నార్జిగా నియమించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కు మధుసూదన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 14న ప్రారంభమయ్యే వారాహి యాత్ర కు రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. నియంత్రిత్వ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజల సిద్దం గాన్నారన్నారు. అధికారం కోసం సొంత చిన్నాన్ననే చంపిన జగన్నోహన్ రెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు భయపడుతున్నాడని బెయిల్ పేరుతో నాటకమాడుతూ అధికారాన్ని అడ్డుపెట్టుకుని తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడన్నారు. ప్రజలు ఎంతో విజ్ఞులని రాష్ట్రంలోని అధికార పార్టీ చేస్తున్న అన్యాయాలను, అక్రమాలను గమనిస్తున్నారని ఎన్నికల సమయంలో అధికార పార్టీకి ప్రజలే సరైన గుణపాఠం చెప్తారన్నారు.