Logo
Date of Publish : 01 April 2026, 9:43 am
Editor : Sake Naresh

వైఎస్ జగన్‌ను కలిసిన న్యాయవాది పేరూరు నాగిరెడ్డి

అనంతపురం, మార్చి 31 (జనస్వరం) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రముఖ న్యాయవాది, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పేరూరు నాగిరెడ్డి మంగళవారం తాడేపల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి, జగన్‌ను శాలువాతో సన్మానించి తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఆయన వెంట ధర్మవరం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తాడిమర్రి చంద్రశేఖర్ రెడ్డి సహా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా హాజరయ్యారు. సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో పార్టీ బలోపేతం, గ్రామ స్థాయిలో కార్యకలాపాల విస్తరణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిసింది.

అనంతరం నాయకులతో మాట్లాడిన జగన్, రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరించడంతో పాటు పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించినట్లు సమాచారం. రాబోయేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని విశ్వాసం వ్యక్తం చేసిన ఆయన, అందుకోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చినట్లు తెలిపారు. దీనికి స్పందించిన నాగిరెడ్డి మరియు ఇతర నాయకులు పార్టీ కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని, అధినేత మార్గదర్శకత్వంలో మరింత ఉత్సాహంగా పని చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే జిల్లాలో పార్టీని మరింత బలపరచేందుకు కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతామని వెల్లడించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com