Logo
Date of Publish : 30 November 2021, 5:34 pm
Editor : Sake Naresh

అడుక్కోగుంత, గజానికో గొయ్యి.. విజయనగరం కలక్టరేట్ కూడళ్ళలో పరిస్థితి

         విజయనగరం ( జనస్వరం ) : ప్రధాన కూడలైన జిల్లా కలక్టరేట్ నుంచి కామాక్షి నగర్ మీదుగా అయ్యన్నపేట జంక్షన్ వరకు రోడ్డు అంతా అస్తవ్యస్తంగా ఉండటంతో వెంటనే రోడ్లు మరమ్మతులు చేపట్టాలని జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు) ఆధ్వర్యంలో జాతీయ ప్రధాన రహదారి సహాయక ఇంజనీర్ కె.వి.ఎల్. నరసింహారావుకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సీనియర్ నాయకుడు బాలు మాట్లాడుతూ విజయనగరం జిల్లా కలక్టరేట్ కార్యాలయం నుండి అయ్యన్నపేట జంక్షన్ కు వెళ్లే వయా తాటిపూడి రహదారి మొత్తం చాలా దారుణంగా మారిందని, అటువైపుగా వెళ్లే వాహన చోదకులు అవస్థలు వర్ణనాతీతమని, ఎన్నో ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఈ రహదారి దర్శనం ఇస్తుందని అన్నారు. జిల్లా కేంద్రంలో అందునా కలెక్టర్ కార్యాలయం సమీప రహదారులను కూడా బాగు చేయకుండా జిల్లా యంత్రాంగం అశ్రద్ధ వహిస్తున్నారని అన్నారు. అలాగే అదే దారిలో కామాక్షి నగర్ లో ఉన్న శ్రీ చైతన్య స్కూల్ వద్ద కనీసం వేగ నియంత్రణ కోసం స్పీడ్ బ్రేకర్స్ వేయాలని అక్కడ విద్యార్థుల తలిదండ్రులు ఆవేదన చెందుతున్నారని, స్కూల్ తెరిచే సమయంలో అలాగే స్కూల్ విడిచాక విద్యార్థులతో అక్కడ ఉన్న దారంతా కాస్త గందరగోళంగా ఉంటుందన్నారు ఆ దారిలో వెళ్లే వాహనాలు వేగంగా వెళ్లడం వల్ల విద్యార్థులకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని, అందుమూలాన స్కూల్ వద్ద మరియు అయ్యన్నపేట జంక్షన్ వద్ద స్పీడ్ బ్రేకర్స్ వేయాలని కోరుతున్నామని తెలిపారు. గత కొద్ది నెలలుగా జిల్లాలో అనేక రహదారులు అస్తవ్యస్తంగా మారాయన్న సంగతి ప్రజలందరికీ విధితమేనని.. అనేకమార్లు వినతిపత్రాలు ఇస్తున్నా సరైన స్పందన ప్రభుత్వం నుండి కరువైందని వాపోయారు. ఇప్పటికైనా ఈ రహదారులు మరమ్మత్తులు చేసి ప్రజల అసౌకర్యాన్ని తీర్చాలని జనసేన తరఫున డిమాండ్ చేస్తున్నామని లేదంటే రోడ్లు మరమ్మతులు చేపట్టేవరకు జనసేన పార్టీ పోరాడుతోందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యువ నాయకులు లోపింటి కళ్యాణ్, చెల్లూరి ముత్యాల నాయుడు, వాసు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com