ఆదోని ( జనస్వరం ) : పవన్ కళ్యాణ్ పైన అభిమానంతో జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి మల్లప్ప ఆధ్వర్యంలో ఆదోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల ప్రజలు భారీ ఎత్తున జనసేన పార్టీలో తీర్థం పుచ్చుకున్నారు. రాబోయే రోజులో జనసేన పార్టీ వెంటే నడుస్తూ 2024 ఎన్నికలో జనసేనపార్టీని ఆదోనిలో గెలిపిస్తామని పార్టీలో జాయిన్ అయిన వారు అన్నారు. మల్లప్ప మాట్లాడుతూ రాజకీయం డబ్బుతో ముడిపడిన వ్యవస్థ అని రాజకీయలవైపు కన్నెత్తి చూడలంటేనే భయపడేవారిని సైతం ఎంతో మంది యువకులకు ఆవకాశం కల్పించిన పార్టీ జనసేన అని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువతలో ప్రశ్నించేతత్వం రావాలని అప్పుడే అవినీతి జరగకుండా పారదర్శకంగా అభివృద్ది పనులు సక్రమంగా జరుగుతాయని తెలిపారు. నేటి వ్యవస్థ మార్పుకోసం జరుగుతున్న ఉద్యమాల్లో యువతరమే సింహాభాగంగా సాగుతుందని భావి భారత నిర్మాణం యువత చేతుల్లోనే ఉందని గుర్తుచేశారు. దేశానికి యువత ప్రధాన సంపద బలమైన ఆయుధం లాంటి వారని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అని అన్నారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com