
సూళ్లూరుపేట, (జనస్వరం) : నియోజకవర్గంలోని దొరవారిసత్రం మండలం బూదూరు గ్రామంలో 30 మంది యువకులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్బంగా నియోజకవర్గ ఇంఛార్జి ఉయ్యాల ప్రవీణ్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు నచ్చి పార్టీ చేరినట్లు తెలియజేశారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తున్న బూదూరు గ్రామ జనసైనికులు అందరికీ ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో అవల రమణ, శ్రీహరికోట జగదీష్, తిపాలపుడి రమణ, జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.