విశాఖపట్నం స్థానిక 42 వ వార్డ్ లో జనసేన 42 వార్డ్ ప్రెసిడెంట్ ముమ్మిన. నాగమణి ఆధ్వర్యంలో వైస్సార్సీపీ సీనియర్ నాయకుడు మైగాపుల. పవన్ కుమార్ సుమారు 100 మంది యువత, మహిళ లు జనసేన పార్టీ లో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిధి గా వచ్చిన జనసేన విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం ఇంచార్జి పసుపులేటి ఉషాకిరణ్ అందరికి జనసేన పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఉషాకిరణ్ మాట్లాడుతూ నాగమణి గారి ఆధ్వర్యంలో ఇంతమంది ఉత్సాహంగా పార్టీ సభ్యత్వం తీసుకోవటం చాలా సంతోష దాయకమైన విషయం అని అన్నారు. పార్టీ సిద్దాంతాలకు లోబడి, అందరు కష్టపడి పనిచేసి పార్టీకి మంచి భవిష్యత్ ని ఇవ్వాలి కోరారు. తద్వారా ప్రజలకు అన్ని విధాలుగా సమస్యలలో తోడ్పాటు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేట్ అభ్యర్థులు నీరుకొండ. దివాకర్, బోడసింగి శ్రీధర్, . విఠల్, గోపికల్యాణ్ వానపల్లి. రంగారావు. మాణిక్యాలరావు, గౌరీశంకర్, పెద్దస్థాయి లో జనసైనికులు, వీరమహిళలు వీర మహిళలు గారపాటి. లక్ష్మీ, ప్రమీల, కుమారి N తదితరులు పాల్గొన్నారు.