
విశాఖ ( జనస్వరం ) : విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం 89వ వార్డ్ చంద్ర నగర్ రామాలయం దగ్గర జనసేన పార్టీ జెండాను పార్టీ నాయకులు శ్రీ పేతకం శెట్టి శ్యామ్ సుధాకర్ గారు ఎగురవేసి పార్టీ బలోపేతం చేసే దిశగా ముందు అడుగు వేశారు. వార్డ్ లో ఉన్న పలువురు అభిమానులు పార్టీ కండువా వేసుకుని పార్టీలో చేరడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారాయి, అధికారాలు మారారు.. ఎమ్మెల్యేలు మారారు టిడిపి ప్రభుత్వం గానీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గానీ మన వార్డు అభివృద్ధికి ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదని కావున ప్రజల వద్దకు ఈ సమస్యలను ఈ ప్రభుత్వ వైఫల్యాలను తీసుకుని వెళ్లి జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ప్రజల్లో బలపరిచే విధంగా మనం ప్రయత్నం చేయాలని సైనికులను కోరడం జరిగింది. అనంతరం పార్టీ ముఖ్య నేతలు సమావేశం లో వార్డ్ లో గల సమస్యలు తెలుసుకొని సమస్యల పరిష్కారానికై పార్టీ తరుపున కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.