చంద్రగిరి ( జనస్వరం ) : పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి చంద్రగిరి నియోజకవర్గం, రామచంద్రాపురం మండలం, టీవి పురం పంచాయతికి చెందిన 150 కుటుంబాలు బీగాల అరుణ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరటం జరిగింది. ఈ సందర్భంగా అరుణ గారు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి. ఆమె మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఇప్పటికే చాలామంది జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ప్రతి నిత్యం ఎక్కడో ఒక చోట వందలకొద్దీ పార్టీలో చేరడం శుభపరిణామం అని, ఈ చేరికలు చూస్తున్నట్లయితే రేపు రాబోయే ఎలక్షన్లలో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా అహర్నిశలు కష్టపడి పార్టీని బలోపేతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈశ్వర్ హరీష్ గణేష్ అధ్యక్షతన జరగడం అలాగే గ్రామస్తులు మొత్తం పాల్గొనడం జరిగింది తదితరులు పాల్గొన్నారు