Logo
Date of Publish : 27 July 2021, 2:31 am
Editor : Sake Naresh

డోన్ నియోజక వర్గంలో జనసేన పార్టీలోకి నూతన కార్యకర్తల చేరిక

               డోన్ ,  (జనస్వరం) :    డోన్ నియోజక వర్గం, బేతంచర్ల మండలం, బలపాల పల్లె గ్రామానికి చెందిన కొంత మంది యువకులు బాలుయాదవ్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. అనంతరం వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బాలుయాదవ్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్న తమతో కలిసి ప్రయాణించడానికి బలపాలపల్లె యువకులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడమే ధ్యేయంగా ప్రతీ ఒక్కరూ పనిచేయాలన్నారు. డోన్ నియోజక వర్గంలో కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఇదే విధంగా డోన్ నియోజక వర్గంలో అనేక గ్రామాల నుండి యువకులు,పెద్దలు జనసేన పార్టీలో చేరడానికి సిద్దంగా ఉన్నారన్నారు. గతంలో చంద్ర బాబు ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని గత ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. కానీ జగన్ మోహన్ రెడ్డి కూడా చంద్ర బాబు లాగే రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కావున రాబోయే రోజుల్లో కచ్చితంగా పవన్ కల్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడానికి మనమందరం కలిసి సమిష్టిగా కృషి చేద్దాం అని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ బేతంచెర్ల మండల క్రియాశీలక జనసైనీకులు మద్దయ్య నాయుడు, పరమేష్, నవీన్, నాగమునేంద్ర, ఆర్య, ప్యాపిలి సునీల్, జగదీష్ మరియు బలపాల పల్లె గ్రామ జనసైనీకులు శివ , మధు, చరణ్, రామాంజనేయులు, మనోహర్, వెంకటేష్, మహేష్, చిన్ను, భాస్కర్, అశోక్, ప్రకాశం, చిరంజీవి, G.మధు, రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com