
రాజోలు ( జనస్వరం ) : రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం శృంగారపాడు కాలనీకి చెందిన జనసైనికులు పరస సత్యనారాయణ గారికి రెండు కిడ్నీలు పాడైపోయాయి. వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతున్న తన గురించి తెలుసుకుని గుడపల్లి గ్రామానికి చెందిన జనసేన వార్డ్ నెంబర్ అడబల నాగేశ్వరరావు గారు మరియు జనసేన కార్యకర్తలు కోసాన వీరబాబు, ఉలిశెట్టి శ్రీను, కటికిరెడ్డి శ్రీను కలిసి వారికి 5000రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం అందజేయడం జరిగింది. సహాయం చేసే దాతలు ఎవరైనా ఉంటే వారికి సహాయం చేయవలసిందిగా గూడపల్లి జనసేన వార్డ్ మెంబర్ అడబల నాగేశ్వరావు గారు కోరుతున్నారు.