ఎమ్మిగనూరు ( జనస్వరం ) : తెలుగు చిత్రపరిక్షమ పేరుని విశ్వవ్యాప్తంగా మారుమోగించిన హీరో మెగా పవర్ స్టార్ మరియు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎమ్మిగనూరు తాలూకా మెగా ఫ్యాన్స్ సేవా సమితి తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్ తెలిపారు. రామ్ చరణ్ 38వ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా స్థానిక వేదాస్ వృద్ధాశ్రమం నందు వృద్ధులకు పిల్లలకు కొబ్బరి బొండం మరియు మజ్జిగ ప్యాకెట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా రాహుల్ సాగర్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఉన్నతమైన స్థానానికి గ్లోబల్ స్టార్ రాంచరణ్ గారు ఎదగాలని ఆయన నటించబోయే ప్రతి ఒక్క సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని భారతదేశ ఖ్యాతిని అదేవిధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని పెంపొందించాలని ఆశభావం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో శివ, జయప్రకాష్, రాఘవేంద్ర, మారుతి పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com