ఏలూరులో ( జనస్వరం ) : జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఏలూరులో జనసేనపార్టీ లోకి జాయిన్ అయ్యారు. రెడ్డి అప్పల నాయుడు చేస్తున్న సేవా కార్యక్రమాలు నచ్చి 45 వ డివిజన్ నుండి అధికార పార్టీకి చెందిన సుమారు 15మంది నాయకులు కార్యకర్తలు, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది.. వీరికి రెడ్డి అప్పల నాయుడు జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. వీరికి రానున్న 2024 ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలో అని దశ నిర్దేశం చేశారు.. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పోరాటంలో మీరందరూ సహకరించాలని రానున్న రోజుల్లో ఏలూరు నియోజకవర్గం లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని రెడ్డి అప్పల నాయుడు సూచించారు.. రాబోయే రోజుల్లో జనసేన జెండా ఎగురవేయడం కోసం కావలసిన ప్రణాలికను రచించడం కోసం వ్యూహాత్మకంగా ఈరోజున ఉన్న అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే దిశగా మనమందరం కృషి చేయాలని కోరారు..
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com