– మూడవ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదును పశ్చిమ లో విజయవంతం చేద్దాం.
– కీలక సమయాల్లో క్రియాశీలక సభ్యత్వం జనసైనికుల కుటుంబాలకు అండగా ఉంటుంది.
– 5000 నుండి 7500 క్రియాశీలక సభ్యత్వాలను పశ్చిమ నియోజకవర్గంలో అందించేలా కృషి చేద్దాం
– ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పని చేద్దాం
విజయవాడ, (జనస్వరం) : కార్యకర్తలే జనసేనపార్టీకి బలమని పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్, విజయవాడ నగర అధ్యక్షులు & రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అన్నారు. స్థానిక కార్యాలయంలో అయన ఆధ్వర్యంలో మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో పశ్చిమ నియోజకవర్గానికి చెందిన డివిజన్ అధ్యక్షులు, నగర కమిటీ, రాష్ట్ర కమిటీ, అమ్మవారి ధార్మిక సేవ మండలి, అధికార ప్రతినిధి, లీగల్ సెల్, ఐటి, కృష్ణా పెన్నా మహిళా కమిటీ, కృష్ణాజిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. గత ఏడాది 2000 పై చిలుకు క్రియాశీలకు సభ్యత్వాలను చేశామని ఈ ఏడాది 5వేల నుంచి 7500 మంది క్రియాశీలక సభ్యులను, రాబోయే ఎన్నికల దృష్ట్యా చేర్పించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాలని, క్రియాశీలక సభ్యత్వం 500 రూపాయలతో తీసుకున్న వారికి పార్టీ కార్యక్రమాల వివరాలు నేరుగా పార్టీ నుంచి అందుతాయని, పార్టీ కిట్, ప్రమాదం బారిన పడి మరణిస్తే రూ.5 లక్షల నష్టపరిహారం అందుతుందని, ప్రమాదం జరిగితే ఆసుపత్రి ఖర్చులు నిమిత్తం రూ.50 వేల వరకు పరిహారం అందజేస్తారని ఇటువంటి క్రియాశీలక సభ్యత్వం రాష్ట్రంలో ఏ పార్టీ కూడా చేయడం లేదని, కార్యకర్తల భద్రత భరోసా భవిష్యత్తులను దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్ ఎంతో దూరదృష్టి తో చేస్తున్నారన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయం జనసేనపార్టీ మాత్రమేనని, నాలుగు సంవత్సరాలుగా నిత్యం అధికార పార్టీ చేస్తున్న అవినీతి అరాచక అన్యాయాలను జనసేన పార్టీ మాత్రమే ఎదిరించి పోరాడి ప్రజల పక్షాన నిలిచామన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోతేనే మహేష్ పోటీ చేస్తారని భారీ మెజార్టీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.