Logo
Date of Publish : 16 April 2022, 4:32 pm
Editor : Sake Naresh

కార్యకర్తలే జనసేనకు బలం : అనంతపురం జిల్లా జనసేనపార్టీ ఉపాధ్యక్షులు లాయర్ జయరామిరెడ్డి

    అనంతపురం, (జనస్వరం) : జనసేన పార్టీ దినదినాభివృద్ధి చెందుతోంది అంటే అందుకు కార్యకర్తలే ప్రధాన కారణం. పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కార్యకర్తలే జనసేనకు బలం అని ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు లాయర్‌ జయరామిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కోర్టు రోడ్డులోని ఆయన కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన నగర కార్యవర్గ సభ్యులను ఘనంగా సత్కరించారు. లాయర్‌ జయరామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాయలసీమ ప్రాంతీయ కమిటీ సభ్యులు పెండ్యాల శ్రీలత, జనసేన లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షులు లాయర్‌ జి మురళీకృష్ణ, పెండ్యాల హరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి నూతన కార్యవర్గం  శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మీకు అన్ని విధాలుగా తాము అండగా ఉంటామని అధికార వైసిపి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని అధినేత పవన్‌ కళ్యాణ్‌ సిద్ధాంతాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం పెండ్యాల శ్రీలత, అధికార ప్రతినిధి సాకే మురళీకృష్ణతో పాటు నూతన నగర కార్యవర్గాన్ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, రాప్తాడు ఇంఛార్జ్ సాకే పవన్‌ కుమార్‌, జిల్లా కార్యదర్శులు ఇండ్ల కిరణ్‌ కుమార్‌, రాపా ధనుంజయ, పాలవాయి చరణ్‌, శ్రీనివాసులు, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com