Logo
Date of Publish : 20 February 2023, 4:05 pm
Editor : Sake Naresh

దోమకొండ అశోక్ ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం

                   విజయవాడ, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు సూచనల మేరకు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ యువ నాయకులు దోమకొండ అశోక్ ఆధ్వర్యంలో 7వ డివిజన్ లో ఏర్పాటు చేసిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు పాల్గొన్నారు. 7వ డివిజన్ లో గడప గడపకు పర్యటించిన వాసు ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ దేశంలోనే ఏ రాజకీయ పార్టీ ఇవ్వని విధంగా, జనసేన పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు, వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇస్తూ, వారి కుటుంబ సభ్యులకు పెద్దన్నల నిలబడుతున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి 2024లో ఒక అవకాశం ఇవ్వాలని, జనసేన పార్టీకి మీ ఆశీస్సులు కావాలని, క్రియాశీలక సభ్యత్వం తీసుకుని జనసేన పార్టీలో భాగస్వాములు కావాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో 7వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షురాలు దోమకొండ మేరీ, ఉపాధ్యక్షులు పెళ్లూరి ఉమామహేశ్వరరావు, సాదిరెడ్డి శ్రీను, 6వ డివిజన్ అధ్యక్షులు పెద్దిరెడ్డి తిలక్, 8వ డివిజన్ ఉపాధ్యక్షులు అనిల్, బండి ప్రదీప్, పెందుర్తి విజయ్ కుమార్, భాస్కర్, సాయి మోహన్, పెందుర్తి ప్రశాంతి, జనసేన పార్టీ 7వ డివిజన్ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com