విశాఖ పశ్చిమ నియోజకవర్గం పీలా రామకృష్ణ ఆధ్వర్యంలో 56వ వార్డులో క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం
విశాఖ పశ్చిమ నియోజకవర్గం 56వ వార్డ్ ముఖ్య జనసైనికులతో క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం పై అవగాహన కల్పిస్తున్న పశ్చిమ నియోజకవర్గం నాయకులు పీలా రామకృష్ణ గారు. త్వరితగతిన ప్రారంభించి, ప్రతి యొక్క జనసైనికుడుకి, వీర మహిళలకు క్రియాశీలక మెంబర్షిప్ యొక్క ఉపయోగం తెలియజేసి అందరినీ సభ్యునిగా చెయ్యాలి అని తెలియజేశారు. పీలా రామకృష్ణ మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలు క్షేమంగా ఉండాలని జనసేన కార్యకర్తలకు జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ప్రమాదవశాత్తు హాస్పిటల్ 50 వేల రూపాయలు జీవిత బీమా కింద ఐదు లక్షల రూపాయలు రూపాయలు ఇన్సూరెన్స్ సౌకర్యం అధినేత పవన్ కళ్యాణ్ గారు కల్పించారు. మరే ఇతర పార్టీలు లేని విధంగా పవన్ కళ్యాణ్ గారు కల్పించిన అవకాశాన్ని కార్యకర్తలు అందరూ వినియోగించివలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో 40వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి శివశంకర్, జనసేన పార్టీ 56వ వార్డ్ జనసైనికులు, నాయకులు సాయిరాం, ధర్మేంద్ర, సంతోష్, చిరంజీవి, భాను, దిలీప్, ధర్మ, నందన, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.