మార్కాపురం ( జనస్వరం ) : ఆంధ్రప్రదేశ్లోలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యలపై చేసిన పోరాటాలు, మరియు దానాలు ఒక కరపత్రంగా ముద్రించి, మార్కాపురం సాయి బాలాజీ థియేటర్ వద్ద, "భీమ్లా నాయక్" సినిమా రిలీజ్ సందర్భంగా కరపత్రాలు అందరికీ పంచడం జరిగింది. అలాగే సామాన్య ప్రజలకు జనసేనపార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టిన క్రియాశీలక సభ్యత్వం గూర్చి వివరించారు. అలాగే దాని వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. జనసేన నాయకులు మాట్లాడుతూ చాలామంది జనసైనికులు సినిమా అభిమానులుగా ఉన్నారని వారిని రాజకీయ అభిమానులుగా మార్చడమే మా లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రెటరీ సురేష్ బాబు, మరియు జనసైనికులు, వీరీశెట్టి శ్రీను, హరి తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com