శ్రీకాళహస్తి ( జనస్వరం ) :జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా గారు శ్రీకాళహస్తి పట్టణం లోని కొండ మిట్ట కాలనీలో ఇంటింటికీ పర్యటించి సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి వివరించడం జరిగింది, ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించాలని ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య గారు, తొట్టంబేడు మండల అధ్యక్షులు గోపి, జిల్లా కార్యదర్శి పద్మజ గారు, ఐటీ కోఆర్డినేటర్ శివ కుమార్, వీర మహిళలు పుష్ప, జ్ఞాన ప్రసూనాంభ , నాయకులు రవి కుమార్ రెడ్డి, నితీష్ కుమార్, గిరీష్ జనసైనికులు బాలు, హేమంత్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.