నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రాజన్న వీర సూర్య చంద్ర అధ్యక్షతన నాలుగు మండలాల జనసేన నాయకుల సమక్షంలో ఈరోజు నర్సీపట్నం పార్టీ కార్యాలయం నందు శిక్షణా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ఇదివరకే రెండు దఫాలుగా రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలలో ఈ కార్యక్రమం పూర్తి చేశారు. మూడవ దశ కార్యక్రమంలో భాగంగా నర్సీపట్నం నియోజకవర్గం ఎంపిక చేసిన పిదప ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతున్నదని అన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీకి పనిచేస్తున్న ప్రతి జన సైనికుడికి క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసి నమోదు చేసుకున్న ప్రతి జనసైనికులు కూడా ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నారని అంతేకాకుండా ప్రమాదవశాత్తు అనుకోని సంఘటన జరిగితే తక్షణమే 50వేల రూపాయలు యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్ పాలసీ చేయడం జరుగుతుందని అన్నారు. మన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలకు భరోసా కల్పించే విధంగా చేసిన ఈ కార్యక్రమం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాల జనసైనికులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం టౌన్ మరియు నాలుగు మండలాల జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com