Logo
Date of Publish : 13 February 2023, 4:37 pm
Editor : Sake Naresh

పార్టీ జెండా భుజాన మోసే ప్రతి కార్యకర్తల సంక్షేమం కోసం క్రియాశీలక సభ్యత్వం : గునుకుల కిషోర్

           నెల్లూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త ప్రసన్న ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ సమక్షంలో పార్టీలో చేరి జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఏ రాజకీయ పార్టీ తీసుకొని నిర్ణయం జనసేన పార్టీ తీసుకుంది అదే క్రియాశీలక పార్టీ క్రియాశీలక సభ్యత్వం. పార్టీ జెండా భుజాన మోసే ప్రతి కార్యకర్తల సంకల్పం పట్టిదలను జనసేన ఏనాడు విస్మరించదన్నారు. పవన్ కళ్యాణ్ గారు జనసేన కార్యకర్తలను ప్రాణప్రదంగా చూసుకుంటారనే దానికి నిదర్శనం ఈ జనసేన క్రియాశీలక సభ్యత్వం.500 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకున్నా పవన్ కళ్యాణ్ గారు గత సంవత్సరం అదనంగా రెండు కోట్ల రూపాయలు తన సంపాదన నుంచి వెచ్చించి కార్యకర్తల కు భరోసా గా నిలిచారు. ఇప్పటి వరకూ ప్రమాదవశాత్తు మరణించిన దాదాపు 196 మందికి ₹5,00,000 రూపాయలను,అదేవిధంగా 69 మందికి ప్రమాద భీమా ₹50000 రూపాయలు అందించి వారి కుటుంబాలకు జనసేన తరపున భరోసా నిలిచారు. జనసేన నాయకులు,కార్యకర్తలు జనసేన క్రియాశీలక సభ్యత్వం గురించి వివరించి అందరినీ సభ్యులుగా చేర్పించవలసిందిగా బాధ్యత తీసుకోండి అని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి గాజు గ్లాస్ కి ఈసారి అవకాశం ఇచ్చి జనసేన పార్టీ ని గెలిపించాల్సింది గా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో ప్రసన్న,ప్రశాంత్ గౌడ్,రహీం, సలీం, షామీర్, కార్తీక్,జయ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com