గుంతకల్ ( జనస్వరం ) : నిస్వార్థ జనసైనికులకు క్రియాశీలక సభ్యత్వం అందజేయడంలో భాగంగా గుంతకల్ పట్టణం జనసైనికుడు పవర్ శేఖర్ షాప్ నందు సభ్యత్వ నమోదు లింక్ తీసుకున్న వాలంటీర్లకు జిల్లా కార్యదర్శి వాసగిరి మణికంఠ గారు అవగాహన కల్పిస్తూ అలాగే జనసైనికుడు ఆటో రామకృష్ణ గారికి క్రియాశీలక సభ్యత్వానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా వినోదం కోసం, రాజకీయాలు మన బాధ్యత అని భావించి జనసేనపార్టీ బలోపేతం కోసం గ్రామస్థాయిలో, మండలపరిధిలో, పట్టణ పరిధిలో కష్టపడుతున్న ప్రతి ఒక్క జనసేనపార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు భద్రత మరియు భరోసా కోసం జనసేనపార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు ముందుకు తెచ్చారన్నారు. జనసేనను మనస్ఫూర్తిగా అభిమానించే వ్యక్తిని సమాజం మంచి కోరే వ్యక్తిగా జనసేన భావిస్తుంది, జనసైనికుడు సమాజం భాద్యత తీసుకుంటే, అతని కుటుంబం భాద్యత పార్టీ తీసుకోవాలని అలాగే జనసైనికుడు పార్టీకి అండగా ఉంటే అతని భావితరాలకు నేను అండగా ఉంటాను అని చెప్పే జనసేనాని ఆలోచనా విధానమే ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం అని పేర్కొన్నారు. కావున ప్రతి జనసైనికుడు ఈ అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకొని సమాజానికి, కుటుంబానికి భరోసా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గుంతకల్ మండల అధ్యక్షుడు కురువ పురుషోత్తం, 13 వార్డు ఇంచార్జ్ బండి శేఖర్, రాష్ట్ర సాయి ధరంతేజ్ యువత అధ్యక్షులు పవర్ శేఖర్, కసాపురం సుబ్బయ్య, ఎస్ కృష్ణ, పాండు కుమార్, మంజునాథ్, సూర్యనారాయణ, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.