పాలకొండ ( జనస్వరం ) : నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు గారి ఆధ్వర్యంలో బల్లంకి వీధి లో జనసేన పార్టీ క్రియాశీలక కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గర్భాన సత్తిబాబు మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ గారు ఎంత పెద్ద మనసుతో జనసైనికులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ క్రియాశీలక బీమా పథకం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని గర్భాన సత్తిబాబు గారు అన్నారు. అలాగే క్రియాశీలక సభ్యులు ఉద్దేశించి మాట్లాడిన ఆయన పవన్ కళ్యాణ్ గారికి ప్రజలకు మధ్య వారధిగా క్రియాశీలక సభ్యులు పనిచేయాలని అన్నారు. ఒకక్క క్రియాశీలక సభ్యులు 10 మందిని ప్రభావితం చేయాలని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు తమ జనసైనికులకు అండగా నిలవాలని 5 లక్షల రూపాయలు పథకాన్ని ఏర్పాటు చేశారని, దేశ చరిత్రలో ఏ నాయకుడు కార్యకర్తల కోసం ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని గర్భాన సత్తిబాబు అన్నారు. పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే అది సాధ్యమని గర్భాన సత్తిబాబు ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com