Search
Close this search box.
Search
Close this search box.

రాజకీయ కక్షసాధింపు చర్యలు తప్పు : గునుకుల కిషోర్

గునుకుల కిషోర్

    నెల్లూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ వారి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  వైసీపీ నాయకులకి భయం పట్టుకుంది. వాళ్ళ స్పీచ్లో నాయకుడు జగన్ గురించి మాట్లాడుతారో లేదో కానీ పవన్ కళ్యాణ్ గారు గురించి మాత్రం మాట్లాడటం తప్పనిసరి అవుతుంది. చట్టం అందరికీ సమానం అలాకాకుండా అది బలహీనులకు బలంగాను, బలవంతులకు బలహీనంగాను ఉండడం తప్పు. తప్పుచేసింది నేనైనా చట్టప్రకారం చర్యలు ఉండాలన్నది నా ఉద్దేశ్యం అని కళ్యాణ్ గారు అంటుంటారు. శతవిధాల ప్రయత్నించి పవన్ కళ్యాణ్ గారిని ఆపలేకపోయారు.నిజాయితీ యొక్క పొగరు అట్లానే ఉంటది.  ప్రతిపక్ష నాయకుడు ఒక పార్టీ అధ్యక్షుడు,మాజీ సీఎం అయిన ఒక 70 ఏళ్ల పైబడిన చంద్రబాబు నాయుడి గారి అరెస్టు అయితే పైసాచిక ఆనందం పొందుతూ బాణసంచా కాలుస్తున్నారు వైసిపి నాయకులు. ఈ రోజున పార్టీలకు అతీతంగా ఒక పెద్దాయన,ఎక్స్ సీఎంని మీరు అరెస్ట్ చేసే విధానాన్ని ఖండిస్తూ ఆయన నిలబడిన తీరు ఈరోజు ప్రజల్లో ప్రజల గుండెల్లో వేరే స్థాయికి వెళ్ళింది ఆయన తీసుకున్న నిర్ణయాన్ని బహిర్గతంగా ప్రకటించి ప్రజల గుండెల్లో ఒక ఉన్నత స్థాయిని చేరుకున్నారు.  ఆ స్థాయిని అందుకోవడం దాని గురించి మాట్లాడడం వైసిపి నాయకులు వల్ల ఎవరి వల్ల కాదు.

          వైసిపి నాయకులు మాట్లాడుతూ చట్టం విచారణ జరిపిన తర్వాతే శిక్షలు పడ్డాయి,ఇది సమంజసమే అంటారు. ఈ రోజును చూసుకుంటే వైసీపీ నాయకులు చేస్తున్న దురాగతాలు దోపిడీ గురించి ఆలోచిస్తే వీరందరినీ చట్టపరంగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలో కూడా ఊహ కందని విషయం.  ఒక పక్క ఇసుక గ్రావెల్,గ్రావెల్ దో పేదలకు ఇళ్ల స్థలాలు కొనుగోలు పేరిట అక్రమ సంపాదన,భూకబ్జా ఇవన్నీ ఆలోచించకుండా మాట్లాడుతున్నారని పిస్తుంది. అసలు నిజంగా చట్టాలు పనిచేసినట్లైతే జగన్ గారు జైల్లో ఉండాలని అనుకుంటున్నారు ప్రజలు. వైసీపీ సర్కారు తమకో చట్టం ప్రజాప్రతినిధులకు మరియు ప్రజలకు ఒక చట్టం అనే చందాన వ్యవహరిస్తుంది. రాష్ట్రంలో 144 సెక్షన్ ను పెట్టి ఎవరిని నలుగురు కంటే ఎక్కువ గుమి కూడకుండా చేసి ప్రతిపక్షాల ని ఇల్ల వద్దే కట్టడి చేసి ఎవరిని బయటికి రాకూడదని నోటీసులు జారీ చేసి వైసిపీ వేడుకలు చేరికలు,సంబరాలు చేసుకుంటున్నారు ఈరోజు మన జిల్లాలో చూసినట్లయితే ఒకపక్క సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని గారు చేరికలు పేరిట భారీ ర్యాలీ నిర్వహించారు. 144 సెక్షన్ అమల్లో ఉండగా మరో పక్క కోవూరు నియోజకవర్గంలో ప్రసన్నకుమార్ రెడ్డి గారు అతను ఇష్టం వచ్చినట్లు బహిరంగ సభలు, అక్కడ కూడా చేరికలు చేసుకుంటున్నాడు. ఇవన్నీ సామాన్య మానవుడు ఆలోచించినట్లయితే వీరికో చట్టం మాకో చట్టం వర్తింపజేసేటట్టు వైసిపి నాయకులు ప్రవర్తిస్తున్నారు అని చెప్పి క్లియర్ గా అర్థమవుతుంది. ప్రజలు మీ పాలనలను గమనిస్తూనే ఉన్నారు ఎవరైనా ఎక్కడైతే ఎక్కడైనా ప్రశ్నిస్తే వారికి సంక్షేమ పథకాలు నిలిపియడం, వాలంటీర్ ఉద్యోగాల నుంచి తీసేయడం అన్ని చూస్తూనే ఉన్నారు. వీటన్నిటికీ సరైన గుణపాఠం చెప్పే రోజు సరిగ్గా 6 నెలల్లో ఉంది. ప్యాకేజీ అనే మొరుగే కుక్కలకు అన్నది కూడా నేను ఒకటే సమాధానం అడుగుతున్నాను ఎక్కడైనా మీరు నిరూపించగలరా…నిరాధారమైన అభియేగం మోపడం ఎంత ఎంత తప్పు మీకు తెలియజేస్తాము. జిల్లాలో ఒక వైసీపీ పెద్ద నాయకుడు మాట్లాడుతూ మొన్న జరిగిన స్కామ్ లో కూడా అతనికి పార్టనర్షిప్ ఉంది అని ఏదో మాట్లాడారు ప్రజలు ఈ రోజున పెద్ద వయసు గల ఒక ఎక్స్ సీఎంని అరెస్టు చేసిన విధానం తప్పు ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు.  వీరందరికీ కూడా భాగస్వామ్యం ఉందని మీరు అనుకుంటున్నారా…ఏమి మాట్లాడుతున్నారో ఏమి చేస్తున్నారో మీకే తెలియాలి అర్థం కావడం లేదు. ఆయన నియోజకవర్గంలో పేదలు ఎంత కష్టపడుతున్నారు.కాలుష్యం వల్ల ఆ నియోజకవర్గం ఎంత ఇబ్బంది పడుతుందో రైతులు నీరు కలిషితమై నీరు అందక ఎంత ఇబ్బంది పడుతున్నారు, రేడియేషన్ బాధలతో ఎంత నరకం అనుభవిస్తున్నారనేది అతనికి తెలియదు. బాహాటంగా షో చేసి ఏదో మనమే ఉన్నతంగా ఉన్నామని నిరూపిస్తే సరిపోదు ప్రజల ప్రజల సుఖసంతోషాలు చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని మైమర్చి ప్రవర్తిస్తున్న నాయకులకు త్వరలో బుద్ధి చెప్తారు. రానున్న ఆరు నెలలే మీ రాజకీయం నడుస్తుంది మీ ఆదిపత్యం సాగుతుంది ప్రజలకు నిరంకుశంగా మీ పాలన సాగుతుంది తర్వాత ప్రజా ప్రభుత్వం రానున్నది. ప్రజలందరూ కూడా వీరి వికృత శేష్టలను గమనించి ప్రజా ప్రభుత్వాన్ని జనసేన ప్రభుత్వానికి అవకాశం ఇవ్వవలసినదిగా కోరుతున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జిల్లా ఉపాధ్యక్షులు సుధీర్ బద్దెపూడి,కాపు సంక్షేమ సేన వర్కింగ్ ఇన్చార్జ్ సుధా మాధవ్,వర్కింగ్ కమిటీ సభ్యురాలు భవాని, వీర మహిళలు కృష్ణవేణి, హైమావతి, రేవతి, జనసేన నాయకులు శీను, చిన్న రాజా, షాజహాన్, ప్రశాంత్ గౌడ్, మౌనిష్, హేమచంద్ర యాదవ్, వర్షన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way