నెల్లూరు ( జనస్వరం ) : వైసీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమన్ని గాలికి వదిలి పవన్ కళ్యాణ్ ను విమర్శించడమే పనిగా పెట్టుకుందని జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ విమర్శించారు. గూడూరు జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బుధవారం గూడూరు ఏరియా ఆసుపత్రి వద్ద మృతదేహన్ని తరలించే విషయంలో ప్రయివేట్ అంబులెన్సు నిర్వాహకులు వ్యవహరించిన తీరు పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. వైసీపీ నాయకులు నోటికి వచ్చినట్టు అవగాహన రాహిత్యంతోపవన్ కళ్యాణ్ పై అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోమన్నారు. ఎన్నికల ముందు మహిళలకు ఏమైనా జరిగితే గన్ను కంటే ముందు జగనన్న వస్తాడని చెప్పిన వైసీపీ నాయకులకు దమ్ము దైర్యం ఉంటే నేడు రాష్ట్రంలో ప్రతిరోజూ మహిళల పై జరుగుతున్న అఘాయిత్యాల పై నోరు విప్పాలని సవాల్ చేసారు. రహదారులు, మద్యపాన నిషేధం, CPS రద్దు, ప్రత్యేక హోదా విషయాలను పక్కన పెట్టి దిగజారుడు రాజకీయాలు చేస్తున్న మంత్రులు, మాజీ మంత్రులు నోరు అదుపులో ఉంచుకోవాలని హెచ్చరించారు. అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు ఐనా గూడూరు లో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం మూడు అంగుళాలు కూడా జరగలేదని, అలాగే పట్టణంలోని పలు ప్రాంతాలల్లో సిమెంట్ రోడ్ల గురించి మునిసిపల్ అధికారులకు విన్నవించినా ఫలితం లేదనన్నారు. అనంతరం జనసేన పార్టీ ఐటీ విభాగం నియోజకవర్గ అధ్యక్షులు స్వరూప్ మాట్లాడుతూ సీఎం జగన్ అట్టహసంగా వేల కొద్ది 104,108 వాహనాలను ప్రారంభించిన అవసరానికి అవి అందుబాటులో లేకపోవడం దురదృష్టకరమన్నారు. మంత్రి పదవుల కోసం జగన్ రెడ్డి మెప్పు కోసం పవన్ కళ్యాణ్ ని విమర్శించడం మానుకొని రాష్ట్ర అభివృధిపై ద్రుష్టి పెట్టాలని వైసీపీ నాయకులకు హితవు పలికారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు ఇమ్రాన్, సనత్, శంకర్, శివ, సాయి ఉన్నారు.