Logo
Date of Publish : 10 December 2020, 4:39 pm
Editor : Sake Naresh

గాజులదిన్నే ప్రాజెక్ట్ నీటి లీకేజీపై చర్యలు చేపట్టాలి : ఎమ్మిగనూర్ ఇంచార్జ్ రేఖగౌడ్

గాజులదిన్నే ప్రాజెక్ట్ నీటి లీకేజీపై చర్యలు చేపట్టాలి : ఎమ్మిగనూర్ ఇంచార్జ్ రేఖగౌడ్

  కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం గాజులదిన్నే ప్రాజెక్టు గేట్లలో గత వారం రోజులుగా నెలకొన్న నీటి లికేజీ నివారణకై అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని జనసేనపార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జి రేఖగౌడ్ తెలిపారు. ఈ సందర్బంగా గురువారం రోజు ఏర్పాటు చేసిన సమావేశంలో రేఖగౌడ్ మాట్లాడుతూ ప్రాజెక్ట్ నిర్మించి దాదాపు 40 ఏళ్ళు అవుతున్న పాలకులు నేటి వరకు ఆధునీకికరణ పనులు చెయ్యక నిర్లక్ష్యం చెయ్యడంతోనే ఇలాంటి పరిస్థితులు వచ్చాయని పాలకులు చేస్తున్న నిర్లక్ష్యాలకు రైతులు భయపడుతూ పంటలు పండించుకొనే పరిస్థితి రావడం సిగ్గుచేటన్నారు. వేల ఎకరాలకు సాగునీరు అందిస్తూ వేసవిలో కర్నూలు జిల్లా ప్రజల దాహార్తిని తీర్చే గాజులదిన్నే జలాశయనికి ఇలాంటి పరిస్థితులు వచ్చేంత వరకు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గాజులదిన్నే ప్రాజెక్ట్ గేట్ల నుంచి వస్తున్న నీటి లీకేజీ గురించి చర్యలు చెప్పట్టి వేసవిలో రైతులు వేసుకునే పంటలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. తేలికపాటి నీటి లీకేజీ అని అజాగ్రత్త వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నియోజకవర్గ మీడియా ఇంచార్జి గానిగ బాషా, మండల ప్రధాన కార్యదర్శి రామంజి నేయులు, సమన్వయకర్త ఖాసింవలి, కార్యదర్శులు, భాస్కర్, షఫీ, సుబాన్, పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com