చంద్రగిరి ( జనస్వరం ) : తుమ్మలగుంట మఠం భూములపై అవినీతికి పాల్పడుతున్న హతిరాంజి మఠం అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ శ్రీ రమేష్ నాయుడు మరియు AEO శ్రీనివాసులు రెడ్డి గార్ల మీద తక్షణమే శాఖ పరమైన చర్యలు తీసుకొని వారిని సస్పెండ్ చేయాలి. హథీరాంజీ బాబాకు తిరుమల శ్రీవారు బందీ అయితే. మఠం అధికారులు మాత్రం వైకాపా నేతలకు బందీ అయ్యారు. విలువైన భూములు అధికార పార్టీ నేతల కబంధ హస్తాల్లోకి చేరాయి. తుమ్మలగుంట మఠానికి చెందిన రూ.వేల కోట్ల ఆస్తులు పరాధీనంలోనే ఉన్నాయి. మఠం భూముల్లోని ఆక్రమణలు తొలగించాలని గతంలోనే కలెక్టర్ ఆదేశించినా కేవలం పేదల ఇళ్లను కూల్చి పెద్దలకు దాసో హమయ్యారు. పేదలను కొట్టి, పెద్దలకు తలవంచి..! మఠం భూములపై నేతల పెత్తనం, సొమ్ము చెల్లిస్తే అక్రమాలకు అనుమతిస్తూ భవనాన్ని నిర్మించారు. నిర్మాణ ప్రారంభంలో అడ్డుకోవాల్సిన అధికారులు సదరు వ్యక్తి తనకు అనుకూలంగా స్టే తెచ్చుకునే వరకు వేచి ఉన్నారని సమాచారం. అతని సోదరుడు గోదామును నిర్మించి విక్రయించారు. తర్వాత అక్కడ భూమి విలువ పెరగడంతో తనకు ఇవ్వాలని కొన్నవారిపై ఒత్తిడి తెచ్చారు. వారు ససేమిరా అనడంతో కొట్టించారనే ఆరోపణలున్నాయి. మఠం భూమిలో ముగ్గురు పోలీస్ ఇన్స్పెక్టర్లకు సైతం స్థలాలు ఉన్నట్లు సమాచారం. ఓ జిల్లా స్థాయి అధికారికీ, ఓ వైస్ ఎంపీపీ, మరో వైకాపా సర్పంచి కుటుంబీకులు. పవిత్ర పుణ్యక్షేత్రం అయిన తిరుపతి – తిరుమల పరిసర ప్రాంతాలలో ఉన్న హతిరాంజీ మఠంకు సంబంధించిన భూములను అన్యాక్రాంతం చేసేవిధంగా రమేష్ నాయుడు గారు వ్యవహరిస్తున్న తీరు తుమ్మాలగుంట లోని మఠం భూములకు మరియు పేద ప్రజలకు హాని కలిగించే విధంగా ఉండడం, అలాగే వేల సంవత్సరాల క్రితం దళారుల చేతిలో మోసపోయి తుమ్మలగుంటలోని సర్వే నంబర్ 68,74/2,75,77/2,78/2,88/1,88/2,93/2,100 etc మఠం భూములను కొనుక్కున్న పేదల స్థలాలను అధికారంలో ఉన్న రాజకీయ పెద్దలకు అప్పజెచే క్రమంలో దాదాపు 100 ఇళ్లను నివాసితులు నిద్రిస్తున్న సమయంలో విద్యుత్తు నిలిపివేసి పేదలు కట్టుకున్న ఇండ్లను దాదాపు 30 JCB లు,200 ట్రాక్టర్స్ మరియు 300 మంది పోలీసు బలగాల సహాయంతో అత్యంత కిరాతకంగా మాఫియా, మావోయిస్టుల శిభిరాలపై దాడులు చేసేలా కూల్చివేయడం జరిగింది. అలాగే హతిరాంజీ మఠంకి సంబంధించిన భూముల వివరాలను బహిర్గతం చేసి వాటిని స్థానిక పెద్దలకు సొంతం చేసి దాని ద్వారా లబ్ధి పొందాలని భావిస్తున్న శ్రీ రమేష్ నాయుడు గారిని విచారించి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ. ఏవో రమేష్ నాయుడు గారు మరియు AEO శ్రీనివాసులు రెడ్డి తీసుకుంటున్న చట్ట వ్యతిరేక నిర్ణయాల వల్ల ప్రజలకు హాని జరుగుతుంది. నిజంగా పిట్ పర్సన్ తుమ్మలగుంట మఠం భూముల సంరక్షణే ప్రధాన ధ్యేయంగా ఉంటే క్రింది వాటి మీద ఎందుకు చర్య తీసుకోవడం లేదు.
1. తుమ్మలగుంటలోని మఠం భూముల్లో ఇదే సర్వే నంబర్ లోని పూరి గుడిసెలు వేసుకున్న వారి ఇండ్లకి ఉదయం నాలుగు గంటలకి కరెంటు నిపియాలని ఉత్తర్వులు జారీ చేయడం .
2. తుమ్మలగుంటలోని మఠం భూముల్లో ఇదే సర్వే నంబర్ లో కొట్టి వేయబడ్డ ఇండ్ల వెనుక భాగంలో 30 ఎకరాల మఠం భూమి రిజిస్టర్ చేసిన సబ్ రిజిస్టర్ మీద ఎటువంటి నిర్ణయం తీసుకోక పోవడం ?
3. తుమ్మలగుంటలోని మఠం భూముల్లో ఇదే సర్వే నంబర్ లో దాదాపు 1200 ఇండ్లకి నో అబ్జెక్షన్ జారీ చేసిన పంచాయతీ అధికారుల మీద ఎటువంటి చర్య తీసుకోకపోవడం ?
4. తుమ్మలగుంటలోని మఠం భూముల్లో ఇదే సర్వే నంబర్ లో ఇల్లు కట్టుకున్న వారికి పంచాయతీల నుంచి పన్ను వేసిన అధికారుల మీద ఎటువంటి చర్య తీసుకోకపోవడం.
5. తుమ్మలగుంటలోని మఠం భూముల్లో ఇదే సర్వే నంబర్ లో ఇల్లు కట్టుకున్న వారికి కరెంటు మీటర్ సప్లై చేసిన APSPDCL అధికారుల మీద ఎటువంటి చర్య తీసుకోకపోవడం ?
6. తుమ్మలగుంటలోని మఠం భూముల్లో ఇదే సర్వే నంబర్ లో శాశ్వతంగా ఇల్లు కట్టుకున్న రెండంతస్తుల భవనం నుంచి ఏడంతస్తుల భవనం వరకు ఎటువంటి చర్య తీసుకోకపోవడం?
అలాగే శ్రీ రమేష్ నాయుడు గారికి సహకరిస్తున్న వారిలో ప్రధములు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో పనిచేయుచున్న సి హెచ్ శ్రీనివాస రెడ్డి గారు, సదరు వ్యక్తిపై కూడా శాఖాపరంగా చర్యలు తీసుకోని వారిని విదులనుంచి తొలగించాలి. అధికార పార్టీల నాయకులకు వత్తాసు పలుకుతూ మఠం భూములను కనుమరుగు అయ్యేలా చేస్తున్నారు. ఆ విధులు నిర్వర్తించడానికి ఎక్కడో ఉన్న వ్యక్తి ఇక్కడికి డిపుటేషన్ మీద వచ్చి ఇక్కడ పనిచేయడానికి కారణం ఏమిటి దీని వెనుక ఎవరూ ఉన్నారు ? ఏ రాజకీయ నాయకుడు ఉన్నారు ? కావున పై విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని మఠం భూములను రోజురోజుకి పెత్తందారులకి, బడా నాయకులకి అమ్ముతూ వారికి తొత్తులుగా వ్యవహరిస్తూ మఠం అధికారి రమేష్ నాయుడు గారిని మరియు AEO శ్రీనివాసులు రెడ్డి గార్లను తక్షణమే సస్పెండ్ చేయాలని లేని పక్షంలో పై స్థాయి వరకు చెరవేసి కేంద్ర విభాగాలను కోరి న్యాయ పోరాటం చేసి తుమ్మలగుంట మఠం భూములను సంరక్షించి పేదలకు న్యాయం చేసే విధంగా అలాగే హతీరాంజీ మఠంలో జరుగుతున్న అన్యాయాలను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. మఠం భూములన్నీ పెద్దల అధీనంలోనే ఉన్నాయి. చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బావమరిది ఒకరు తుమ్మలగుంటలోని మఠం భూముల్లో ఇళ్లు కట్టుకున్నారు. వీటిని కొట్టివేసేందుకు అధికారులు యత్నించడం లేదు. నాడూ కొందరిపైనే, అవిలాల పంచాయతీలోని, తుమ్మలగుంట మఠం భూములకు సర్వహక్కులు హథీరాంజీ మఠానికే చెందుతాయని హైకోర్టు 2018లో ఉత్తర్వులిచ్చింది. వీటిని నిషేధిత జాబితాలో పొందుపర్చాలని అప్పటి కలెక్టర్. ప్రొసీడింగ్ జారీ చేశారు. తుమ్మలగుంట ఆక్రమణలు తొలగించాలని మఠం మహంతును కోరారు. 2019లో అధికారులు కొందరి ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిపివేసి కూల్చివేశారు. రెండు, మూడు రోజులు హడావుడి చేసి ఆక్రమణల తొలగింపును పక్కన బెట్టారు. ఒక ముఖ్యనేత ప్రోద్బలంతోనే ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చారనే ఆరోపణలున్నాయి, సదరు వ్యక్తికి సహకరించి తుమ్మలగుంట లోని మఠం భూములను కాపాడి పేద ప్రజలకు న్యాయం చేకూరాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో తిరుపతి అర్బన్ ప్రెసిడెంట్ కిషోర్ రాయల్ ,చంద్రగిరి మండల ప్రెసిడెంట్ తపసి మురళి రెడ్డి మరియు నాయకులు యువరాజ్ రాయల్ ,జనసేన సాయి ,వాకా మురళి, గోపి రాయల్ , దండు లక్ష్మీపతి,హరీష్, దాము తదితరులు పాల్గొన్నారు.