Logo
Date of Publish : 25 January 2023, 2:23 pm
Editor : Sake Naresh

కొలిమిగుండ్ల మండలంలో ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలి : జనసేన పార్టీ నాయకులు

        బనగానిపల్లి ( జనస్వరం ) : కొలిమిగుండ్ల మండలంలో ప్రభుత్వ భూములను యదేచ్ఛగా కబ్జా చేస్తున్న ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని మండల తాసిల్దార్ ఆల్ఫ్రెడ్ కి బనగానపల్లె నియోజకవర్గం జనసేన నాయకుడు భాస్కర్ ఆధ్వర్యంలో కొలిమిగుండ్ల మండలం జనసేన నాయకులు పెద్దయ్య, పృథ్వి లతో కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ మండలంలో కొందరు ఆక్రమణదారులు యథేచ్ఛగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని బహిరంగంగా భూములు చదును చేస్తున్నారని ప్రభుత్వ అధికారులు వారిని నిలవరించకపోతే భవిష్యత్ తరాల అవసరాలకు ప్రభుత్వ భూములు గజం స్థలం కూడా లేకుండా చేస్తారని కావున వాటిపై తాసిల్దార్ చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో జనసేన పార్టీ తరఫున పోరాటం చేయాల్సి ఉంటుందని అన్నారు. కొండ ప్రాంతాలలో జింకలు, నెమల్లు మరియు ఇతర వన్యప్రాణులు జీవిస్తున్నాయని వాటి భవితవ్యం ప్రశ్నార్ధకంగా ఉందని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని కావున అక్రమ దారులకు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలని కొలిమిగుండ్ల తాసిల్దార్ ఆల్ఫ్రెడ్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొలిమిగుండ్ల జనసేన నాయకులు పెద్దయ్య, పృథ్వి, అవుకు మండల నాయకులు అజిత్ రెడ్డి, జనార్ధన్ జనసైనికులు ప్రతాప్, నారాయణ, మద్దిలేటి, ఏసన్న, కొత్త బోయిన నారాయణస్వామి, కళ్యాణ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com