బనగానపల్లె, (జనస్వరం) : బనగానపల్లె పట్టణంలో కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థుల నుండి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆయా పాఠశాలల్లో విద్యార్థులను చదివిస్తున్న వారి తల్లిదండ్రులు కొంతమంది బనగానపల్లె నియోజకవర్గ జనసేనపార్టీ దృష్టికి తీసుకురావడం జరిగింది. జనసేనపార్టీ నాయకులు భాస్కర్ ఆధ్వర్యంలో మండల విద్యాధికారి స్వరూపని కలిసి అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు వివిధ రకాల కార్యకలాపాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక మొత్తంలో ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నారని వాటిని అరికట్టి గవర్నమెంట్ చెప్పిన ప్రకారం నిబంధనలు పాటించేలా అలాగే ప్రతి తరగతిలో 25% పేద విద్యార్థులకు సీట్లు కేటాయించేలా చర్యలు తీసుకొని వాటి వివరాలు బహిర్గతం చేయాలని లేని పక్షంలో జనసేనపార్టీ తరఫున విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి భారీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని జనసేనపార్టీ తరఫున బనగానపల్లె మండల విద్యాశాఖ అధికారి స్వరూపకి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అజిత్ రెడ్డి, కృష్ణ బాబు, సుబ్బు, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com