Logo
Date of Publish : 22 February 2021, 3:20 pm
Editor : Sake Naresh

గాజువాక నియోజకవర్గం దువ్వాడ సెక్టర్1 నందు వీర మహిళ కమలప్రియ గారి ఆధ్వర్యంలో కార్యచరణ మీటింగ్

              GVMC సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గాజువాక నియోజకవర్గం దువ్వాడ సెక్టర్ 1 నందు  జనసేన వీరమహిళ కమలప్రియ గారి ఆధ్వర్యంలో వీర మహిళ విభాగంతో కార్యచరణ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ  కార్యక్రమంలో జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీ వబ్బిన జనార్ధన శ్రీకాంత్ సతీమణి మీనాక్షి గారు పాల్గొని రాబోయే ఎలక్షన్ లో మనమందరం కష్టపడి ప్రజల్లో మరింత చైతన్యం చేసి గాజు గ్లాస్ గుర్తు కి ఎక్కువ ఓట్లు వచ్చే విధంగా కలిసికట్టుగా పనిచేయాలని, మనతో పాటు పక్క గ్రామాల్లో కూడా జనసేన పార్టీ గ్రామాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని కోరడం జరిగింది. పెందుర్తి నియోజకవర్గ వీర మహిళా విభాగం నుంచి శ్రీ పెన్నంటి పార్వతి గారు పాల్గొని జనసేన పార్టీ విజయం ప్రజలకు అవసరమని, మన అభ్యర్థి శ్రీకాంత్ గారిలో మనందరం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని చూసుకొని మహిళల చేత ఎక్కువ ఓట్లు పడేలాగా మనం కష్టపడాలని కోరారు. ప్రజలు కూడా జనసేన పార్టీకి విజయానికి కృషి చేస్తున్నారు పంచాయతీ ఎలక్షన్ లో కూడా సర్పంచులు జనసేన పార్టీ గెలవడం ఒక మంచి సందర్భం అని చెప్పడం జరిగింది. వీరమహిళ రమణి గారు మాట్లాడుతూ జీరో బడ్జెట్ పాలిటిక్స్ జనసేన పార్టీ ఆయుధం అని, ఓటు అనే వజ్రాయుధాన్ని డబ్బులకు మద్యానికి పోకూడదని ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయగా మనం పని చేయాలని కోరడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో దువ్వాడ సెక్టార్ 1 నుంచి అత్యధిక సంఖ్యలో వీర మహిళలు, వార్డ్ గౌరవ అధ్యక్షులు తనుగుద్ది రామారావు గారు తదితర జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com