Logo
Date of Publish : 28 November 2025, 6:25 pm
Editor : Sake Naresh

బడుగు బలహీన వర్గాలకు చెందిన అధికారులపై చర్యలు సరికాదు

- వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి న్యాయవాది పేరూరు నాగిరెడ్డి ఖండన

అనంతపురం, నవంబర్ 28, జనస్వరం : పోలీస్ శాఖలో నిజాయితీగా విధులు నిర్వహిస్తున్న బడుగు బలహీన వర్గాలకు చెందిన సిఐ శంకరయ్య ను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయడం, డిఎస్పి వెంకటేశ్వర్లు విఆర్ కు అకారణంగా పంపడం సరికాదని వైయస్సార్సీపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి న్యాయవాది పేరూరు నాగిరెడ్డి ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండించారు. ఆయన శుక్రవారం మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో అధికారులపై చర్యలు తీసుకున్న విధానాన్ని తప్పు పట్టారు. కోటమి నాయకులు చేసే అవినీతి ఆక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి అధికారులపై మచ్చలు వేయడం సరికాదన్నారు. పోలీసులు శాంతి భద్రతల శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా విధి నిర్వహణలో నిజాయితీగా నిక్కిచ్చిగా పనిచేసే అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా కూటమి ప్రభుత్వా చర్యలు ఉన్నాయని ఆరోపించారు. కేవలం బడుగు బలహీన వర్గాలకు చెందిన అధికారుల నే టార్గెట్ చేసి విఆర్ కు పంపడం మంచి పద్ధతి కాదన్నారు. కూటమి ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పినట్లు వినకపోవడం, వారి అవినీతి ఆక్రమాలకు వంత పడకపోవడం వల్లనే సీఐ శంకరయ్య ను సర్వీస్ నుంచి డిస్మిస్యల్ చేయడం చాలా దారుణం అన్నారు. మరియు డి.ఎస్.పి వెంకటేశ్వర్లు నిజాయితీ అధికారిని విఆర్ కు పంపడం తగదన్నారు. మీ అవినీతి అక్రమాలకు పోలీసులను ఇతర శాఖల అధికారులను బలి పశువులను చేయడం కూడా కూటమి ప్రభుత్వానికి తగదన్నారు. నిజాయితీ అధికారుల వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మీ అక్రమాలకు అధికారులను బలి చేయవద్దని హితువు పలికారు. ఇలాంటి చర్యలకు పాల్పడి అధికారుల్లో ఉన్న ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయద్దని అన్నారు. ఇకనైనా బడుగు బలహీన వర్గాలకు చెందిన నిజాయితీ అధికారుల జోలికి రావద్దని, ఇది ప్రజల గమనిస్తున్నారని కూటమి ప్రభుత్వానికి ఆయన సూచించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com