Logo
Date of Publish : 08 January 2022, 5:09 pm
Editor : Sake Naresh

బాధ్యతగా పని చెయ్యండి – 2024లో జనసేన గెలుపే మన లక్ష్యం : ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్

   ఒంగోలు, (జనస్వరం) : బాధ్యతగా పనిచేయండి 2024 జనసేన గెలుపే మన లక్ష్యమని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారు అన్నారు. శనివారం నగరంలోని కాపు కళ్యాణ మండపంలో ఇటీవల జిల్లాలో మండల అధ్యక్షులుగా నియమితులైన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన షేక్ రియాజ్ గారు నూతన మండల అధ్యక్షులు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో బలంగా నిలబడాలంటే మీరు అందరూ కష్టపడి పనిచేయాలి. తెలుగుదేశం లేదు, వైఎస్ఆర్సిపి లేదు, ఒక్క జనసేన పార్టీ మాత్రమే ప్రజలకు దగ్గరగా ఉందిన్నారు. ప్రతి ఒక్క గ్రామంలో కూడా గ్రామ కమిటీలు వేసుకున్నప్పుడే మన జనసేన పార్టీ నిజంగా బలంగా ఉండేదన్నారు. మీ యొక్క మండలాల్లో ఎవరికైతే పదవి రాలేదో వాళ్లందరినీ కూడా కలుపుకొని గ్రామ కమిటీ వేసే ప్రక్రియలో ముందుకు వెళ్లాలని అన్నారు. మనందరం ప్రకాశం జిల్లాలో 24 ఎన్నికలే లక్ష్యంగా పనిచేద్దామని అన్నారు. ఈ కార్యక్రమం లో ప్రకాశం జిల్లా జనసేన లీగల్ సెల్ అధ్యక్షులు సుంకర సాయి బాబా, గిద్దలూరు జనసేన పార్టీ ఇంచార్జ్ బెల్లంకొండ సాయి బాబా, దర్శి జనసేన పార్టీ ఇంచార్జ్ బోటుకు రమేష్ బాబు, అద్దంకి ఇంచార్జ్ కంచర్ల శ్రీకృష్ణ, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి వంశీ దీప్ చీకటి, ఒంగోలు జనసేన కార్పొరేటర్ మలగా రమేష్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు కళ్యాణ్ ముత్యాల, రాయని రమేష్, బొందిల శ్రీదేవి, మేడ రమేష్, రహీముల్లా, చిరంజీవి శంకరశెట్టి, గూడూరి శివరాం ప్రసాద్, తిరుమలశెట్టి వీరయ్య, నరసింహ లంక, అనుకోజీ రావ్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శులు అరుణ రాయపాటి, కోటి పెంట్యాల, వేముల శ్రీనివాస్, షేక్ ఇంతియాజ్, తోట రాజశేఖర్, దొరస్వామి నాయుడు, బాల రంగయ్య, కాల్వ శ్రీనివాసులు, చదలవాడ ఎంపీటీసీ శివ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com