పాలకుర్తి ( జనస్వరం ) : ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో జనసేన పార్టీ పాలకుర్తి నియోజకవర్గం నాయకులు మేడిద ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గార్ల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మేడిద ప్రశాంత్ మాట్లాడుతూ తెలంగాణ పోరాట ఘటనలో జై జయశంకర్, జై తెలంగాణ నిరంతర వినపడే నినాదాలు. అతని పేరే ఒక నినాదం, తెలంగాణ రూపకర్త తనే. అతని లేని లోటు తెలంగాణలో పూడ్చలేనిది. తెలంగాణ అనే మట్టిని ముద్దలు ముద్దలుగా చేసి ఆశయానికి ప్రాణం పోసి కాలువలుగా పాయలైన వివిధ బావ సరూపత్వా గల సంస్థలు "తెలంగాణ రణ నినాదం" అనే మైదానంలోకి మళ్ళించి జన సముద్రం చేసినవారు ఆచార్య జయశంకర్... నమ్మిన సిద్ధాంతాల కోసం తను నడిచే తవ్వలో ఆటుపోట్లు ఎదురైనా, ఒంటరైనా సర్వజనుల సంక్షేమాన్ని మరువని ఒక మార్గం నిర్దేశకుడు ఆచార్య జయశంకర్ గారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆకుల సైదులు, పూజారి సాయి, N రవి , మాడరాజు అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com