
విశాఖపట్నం ( జనస్వరం ) : శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో ఈ నెల 21న జాయిన్ అయిన మువ్వల నాగేష్ జనవరి 26 మధ్యాహ్నం ఒంటి గంటకు తల్లిదండ్రులతో మాట్లాడిన కొద్ది సేపటికే అతి దారుణంగా హాస్టల్ గదిలోనే దారుణంగా హింసింపబడి తర్వాత దగ్గర్లో ఉన్న తోటలో సజీవ దహనం చేసిన ఘటన ఎటువంటి వారినైనా కలచి వేస్తుంది. శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాల వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న నాగేష్ ఆ తర్వాత బుధవారం ఉదయం సీతంపేట సమీపంలోని జీడి తోటలో సజీవదహనం అయిన విషయం పోలీసుల ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు శ్రీ మువ్వల గోపాల్ మరియు శ్రీమతి సుందరి ఇంకా బంధుమిత్రులు అందరూ కలిసి ఘటనా స్థలానికి చేరి గొడవ చేసిన పిదప తల్లి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత జే ఆర్ పురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. సజీవ దహనం అయిన తర్వాత కూడా కళాశాల యాజమాన్యం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి ఏ విధమైన ప్రకటన రాకపోవడం అందరికీ సందేహాలకు తావిస్తుంది.
విద్యార్థి మువ్వల నగేష్ హత్య కేసు నిందితులను వెంటనే అరెస్టు చేయాలి :
మువ్వలరేవు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి మువ్వల నాగేష్ సజీవదహనం హత్య కేసు అత్యంత హృదయ విచారకరమైనదని. ఈ ఘటనపై పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన ఆదేశాల మేరకు ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీ శివశంకర్ గారు, శ్రీ బొలిశెట్టి సత్య నారాయణ గారు ఫిబ్రవరి 1 వ తేదీన మృతుడి గ్రామమైన నువ్వలరేవు గ్రామంలో పర్యటించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. అలాగే గ్రామస్తులను కలిసి సంఘటన వివరాలు తెలుసుకున్నారు. ఈ అత్యంత పాశవికమైన ఘటనపై ఈరోజు ఉదయం విశాఖపట్నంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అక్కడ నిజానిజాలు మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేయడం జరిగింది.
ఈ సందర్భంగా శ్రీ బొలిశెట్టి సత్యనారాయణ గారు మాట్లాడుతూ మృతుడు నాగేష్ హత్యకేసులో అనేక అనుమానాలు ఉన్నాయని, ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో చేరిన నాగేష్, 26వ తేదీ తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత అనుమానాస్పద రీతిలో, చదువుకుంటున్న కాలేజీకి కొంతదూరంలో జీడి తోటలో హత్య కాబడి సగం కాలిన శవమవ్వడం అత్యంత హృదయ విచారకరం. ఈ ఘటన చదువుకునే ప్రతి పేద విద్యార్థులకు చదువు దూరం చేయాలన్న ఉద్దేశంతో చేశారేమో అనే అనుమానం కలుగుతుంది. కాలేజీలో ఉన్న యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ ఏం చేస్తుంది? అని ధ్వజమెత్తారు. పోలీసులు, ప్రభుత్వం కాలేజీ యాజమాన్యంపై ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు? అలాగే అక్కడున్న వైసీపీ ప్రభుత్వ మత్స్యశాఖ మంత్రి సిదీరి అప్పలరాజు గారు కాలేజీ యాజమాన్యాన్ని ప్రాధేయపడడం చూస్తే కొమ్ముకాస్తున్నారని అనిపిస్తుంది. ఇప్పటివరకు హత్య కేసు నిందితులను పట్టుకోలేకపోవడం పోలీసు శాఖకే అవమానకరం. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన నాగేష్ కుటుంబం నిరుపేద కుటుంబం. ఈ హత్య వలన ఆ కుటుంబానికి అండగా వుండే కొడుకే లేకుండా పోవడం చాలా బాధాకరం అని అన్నారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలి. అలాగే శ్రీ శివాని కాలేజ్, హాస్టల్ యజమాన్యాలను వెంటనే అరెస్ట్ చెయాలి. ఉదాసీనంగా వ్యవహరించిన పోలీస్ అధికారులను తక్షణమే విధుల నుంచి తొలగించాలని కోరారు. వెంటనే నిందితులను పట్టుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల జనసేన పార్టీ ఈ ఘటనపై తీవ్ర ఉద్యమం చేపడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు శ్రీ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ పాల్గొని మాట్లాడారు.