పిఠాపురం ( జనస్వరం ) : పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం నాగులపల్లి సమీపంలో ఉన్న ఉప్పరగూడెంలో గత రెండు రోజుల క్రితం ఏడు ఇల్లులు ప్రమాదవశాత్తు కాలిపోవడం జరిగింది. జనసేన పార్టీ పిఠాపురం నియోజవర్గం పార్టీ ఇన్చార్జ్ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ ఆదేశాలు మేరకు జనసేన నాయకులు వెళ్లి అన్ని కుటుంబాలని పరామర్శించి కుటుంబానికి బియ్యం, కూరగాయలు, వస్త్రాలు ఇవ్వడం జరిగింది. ఉభయ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ చల్లా లక్ష్మీ మూడు నెలల వ్యవధిలో ప్రభుత్వం ఇల్లు ఇస్తానని వారికి మాట ఇవ్వడం జరిగిందని అక్కడ ప్రజలు చెబుతా ఉన్నారు. లేనిపక్షంలో ఆమె వాళ్లకి పక్కా ఇల్లు కట్టించి ఏర్పాటు చేస్తానని వారందరికీ జనసేన పార్టీ తరఫున మాట ఇవ్వడం జరిగింది. పి.ఎస్.ఎన్ మూర్తి ఏడు కుటుంబాలకి బియ్యం, చీరలు, ఇవ్వడం జరిగింది. పిండి శ్రీను కూరగాయలు ఏడు కుటుంబాలకి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిండి శ్రీను, కర్రీ కాశీ విశ్వనాథ్ , పెంకే జగదీష్, కోలా దుర్గాదేవి, కసిరెడ్డి నాగేశ్వరావు, పెద్దిరెడ్డి భీమేశ్వరరావు, పబ్బిరెడ్డి ప్రసాద్, తోట సతీష్, ముప్పన రత్నం, నామా శ్రీకాంత్ పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com