అనంతపురం ( జనస్వరం ) : ABN రాధాకృష్ణ... ఆర్కే విత్ వీకెండ్ అనే కార్యక్రమం ద్వారా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన తెచ్చి నిధులు గురించి... మీ పత్రికలో మీరు ప్రచురించిన నీచమైన కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నామని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ జయరా౦ రెడ్డి ధ్వజమెత్తారు. 2014 నుంచి 2019 దాకా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి, జనసేన పార్టీ గురించి దుష్ట ప్రచారాన్ని మేమింకా మర్చిపోలేదు. మీరు మీ రాజకీయ పార్టీకి మంచి చేసే కోసం జనసేన పార్టీని పావుగా వాడుతామంటే మేము చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నాం. జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పట్ల, జనసేన పార్టీ పట్ల మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా... వికృత క్రీడలు ఆడిన కేవలం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు వ్యతిరేక ఓటు చీలనివ్వనంటున్నారు. ABN రాధాకృష్ణ నిన్ను నీ రాజకీయ పార్టీని కేవలం మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి కోసం భరిస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా నీ వికృత శ్రేష్టలు, నీచమైన రాతలు మానుకోకపోతే భవిష్యత్తులో నీవు ...నీ రాజకీయ పార్టీ తగిన మూల్యం చెల్లించుకుంటాయని నీకు తెలియజేస్తున్నామని హెచ్చరించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com