తిరుపతి ( జనస్వరం ) : దొంగ ఓట్లే వైసిపి ఎన్నికల ఆయుధమన్నారు జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. శనివారం స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద దొంగ ఓట్లుకు నిరసనగా జరిగిన ఆందోళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి పుణ్యక్షేత్రంలో సభ్య సమాజం తలదించుకునేలా నేతలు, కొందరు ప్రభుత్వ ఉద్యోగులు వ్యవహరిస్తున్నారన్నారు. అధికారంలోకి రావడానికి ఎన్ని తప్పుడు మార్గాలుంటే అన్ని తప్పుడు మార్గాలను అనుసరిస్తున్నారన్నారు. వైసిపి నాయకుల దుశ్చర్యకు ఐఎఎస్ అధికారి గిరీషా బలయ్యారన్నారు. డేగ కన్నులాంటి ఎన్నికల సంఘం ముందు తప్పు చేసిన వారికి శిక్ష తప్పదన్నారు. బిఎల్వోలు చిరుద్యోగులని దొంగ ఓట్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఎన్నికల తుది జాబితా విడుదలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో అభినయ్ రెడ్డి దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నారన్నారు. చంద్రగిరి, తిరుపతిల్లో దొంగ ఓట్లపై పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని తెలిపారు. వైసిపి ధనం, దౌర్జన్యం, దొంగ ఓట్లతో గెలవాలని చూస్తోందన్నారు. ప్రజలు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నియోజకవర్గ ఇంచార్జ్ కిరణ్ రాయల్, నగర అధ్యక్షుడు రాజారెడ్డి, రాష్ట్ర, జిల్లా, కార్యవర్గ సభ్యలు, నగర కమిటీ, వార్డ్ డివిజన్ అధ్యక్షులు, జనసైనికులు వీరామహిళలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com