Logo
Date of Publish : 15 October 2020, 10:24 am
Editor : Sake Naresh

జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా అబ్దుల్ కలాం గారి 89వ జయంతి వేడుకలు : జనసేన పార్టీ ఈమని కిషోర్ కుమార్

జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా అబ్దుల్ కలాం గారి 89వ జయంతి వేడుకలు : జనసేన పార్టీ ఈమని కిషోర్ కుమార్

             భారతదేశ ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త, మాజీ 11 వ భారత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి 89వ జయంతి సందర్భంగా జగ్గయ్యపేట నియోజకవర్గ జనసేన నాయకులు ఈమని కిషోర్ కుమార్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ తరుపున ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్టణంలో స్థానిక గవర్నమేంట్ హస్పిటల్ నందు గల ఉన్న అబ్దుల్ కలాం గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర చిరంజీవి యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ మోసిన్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కిషోర్ కుమార్ మాట్లాడుతూ తమిళనాడులో జన్మించిన ఆయన భౌతిక శాస్త్రం అభ్యసించి, వాటికి సంబందించినటువంటి రంగంలో చెన్నై, మద్రాస్ లాంటి ఇన్స్టిట్యూట్ నుంచి ఎన్నో పట్టాలు పొందారని, భారత రాష్ట్రపతి పదవికి ముందు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)తో ఏరోస్పేస్ ఇంజనీర్ గా పనిచేశారు అని భారతదేశం యొక్క "మిస్సైల్ మాన్" అని పిలవబడే కలాం ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి , వాహన ప్రయోగ సాంకేతిక అభివృద్ధికి కృషిచేశారు అని, కలాం తన పుస్తకం "ఇండియా 2020" లో 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించారు అని భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన "భారత రత్న" సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నారు అని, దేశానికీ సంబంధించి ఆయన చేసిన సేవలు మరువలేనివని ఈ సందర్భంగా ఆయన్ని ప్రతి ఒక్క పౌరుడు గుర్తుచేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగ, పాషా, రాజేష్ కన్నా, కన్నా, రాంప్రసాద్, మస్తాన్, పాషా, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com