రైల్వేకోడూరు మండల నియోజకవర్గ పరిధిలో ఆధార్ సెంటర్ కేవలం స్థానిక పి ఎన్ ఆర్ సెంటర్ లో ఉన్నటువంటి బ్యాంకు మాత్రమే ఉన్నదని జనసేన నాయకులు అంకిపల్లి అఖిల్ అన్నారు. గత రెండు నెలలుగా ఆధార్ అప్డేట్ సెంటర్ లేకపోవడంతో రైల్వేకోడూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల నుంచి ఒక్కసారిగా ఆధార్ అప్లికేషన్ కోసం ప్రజలందరూ ఆధార్ సెంటర్ రావడంతో జనం ప్రతిరోజు ఇబ్బంది పడుతున్నారు. రైల్వేకోడూరు జనసేన నాయకులు అంకిపల్లి అఖిల్, కళ్యాణ్ రెడ్డి ప్రసాద్ స్థానిక ఆధార్ సెంటర్ లో ఆధార్ అప్డేట్ చేస్తున్నటువంటి వారిని అడిగితే వారు మేము దాదాపు రెండు నెలల నుంచి ఇదే సమస్యతో బాధపడుతున్నాము అని ఆవేదన చెందారు. ప్రతిరోజు 150 మంది నుంచి 200 మంది వస్తున్నారు. మా వల్ల కంట్రోల్ కావడం లేదు. పోలీసు వారిని కూడా తెప్పించుకొని ఒకసారి కంట్రోల్ చేసుకుంటున్న పరిస్థితులు ఏర్పడ్డాయని జనసేన నాయకులకు తెలియజేయడంతో వెంటనే సమస్యలపై స్పందించారు. తక్షణమే రైల్వేకోడూరు MRO శిరీష గారికి ఆ సమస్యను వివరించి వినతిపత్రం అందజేయడం జరిగింది. సదరు అధికారి మాట్లాడుతూ తక్షణమే సమస్యకు పరిష్కారం అందేలా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అంకిపల్లి అఖిల్, కళ్యాణ్, రెడ్డి ప్రసాద్ దళిత నాయకులు నగిరి పాటి మహేష్ పాల్గొనడం జరిగింది.