Logo
Date of Publish : 07 December 2022, 7:35 am
Editor : Sake Naresh

ఒక యుగపురుషుడు మరణం లేని వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ : గుంటూరు జనసేన నాయకులు

      గుంటూరు, (జనస్వరం) : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, జనసేనపార్టీ జనరల్ సెక్రటరీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ ఒక యుగపురుషుడు, మరణం లేనటువంటి వ్యక్తికి వర్ధంతి చేస్తున్నాము. కానీ వాస్తవానికి వర్ధంతి లేని వ్యక్తి మన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. ఈ దేశంలో అలాంటి మహానుభావుడు పుట్టటం మనము అదృష్టంగా భావించాలి. ఆ మహానుభావుడు రచించిన రాజ్యాంగంలోనే ఈ రోజుకు కూడా యావత్ భారతదేశం ముందుకు వెళ్ళడానికి కారణం అవుతుంది.ఆయన చెప్పిన సూక్తులు తూచా తప్పకుండా మనం పాటించాలి అంతేకానీ జన్మదినాలకు, వర్ధంతులకు దండలు వేసి నివాళులు అర్పించడం కాదు అని ప్రతి ఒక్కరూ గమనించాలి. ఆయన బతికి ఉన్నప్పుడు చెప్పారు నేను చనిపోయిన తరువాత నా విగ్రహాలు పెట్టి విగ్రహరాధనలు చేయవద్దు నేను చెప్పినవి ఆచరించి ఈ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలని చెప్పారు. జనసేన పార్టీ నుంచి రాష్ట్ర ప్రజలకు మేము చెప్పేది ఒక్కటే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మార్గంలో ప్రతి ఒక్కరూ ప్రయాణిద్దాం అప్పుడే వారికి నిజమైన నివాళులు మనము ఇచ్చిన వాళ్ళము అవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నగర నాయకులు, కార్పొరేటర్లు, వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com