అనంతపురం, (జనస్వరం) : అనంతపురం జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ అధ్యక్షతన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి నగరంలోని స్థానిక సప్తగిరి సర్కిల్ నందు జనసేనపార్టీ కార్యాలయంలో అనంతపురం జిల్లా జనసేనపార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలోని ప్రధాన సమస్యలు HLC కాలువ ఆధునికరణ, BT ప్రాజెక్టు కు నీరు తీసుకురవడం, గుంతకల్ స్పిన్నింగ్ మిల్ పునఃప్రారంభం, రైతులకు రావాల్సిన పంట బీమా, వృద్ధాప్య, మహిళ పెన్షన్, కాపు కార్పొరేషన్ నిధులు, C.P.S రద్దు అంశాల గురించి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు విద్యుత్, RTC బస్టాండ్ ఛార్జీల పెంపు, జిల్లా వ్యాప్తంగా అధికార పార్టీ నాయకుల చేస్తున్న భూకబ్జాలు, అధికార మదంతో చేస్తున్న దౌర్జన్యాల గురించి తీవ్రంగానే చర్చించారు. ఈ సందర్భంగా నాయకులు టి.సి.వరుణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ సంస్థాగత నిర్మాణం, జిల్లా వ్యాప్తంగా పట్టణ కమిటీలు, బూత్ కమిటీల ఏర్పాటు రాబోయే రాయలసీమ పట్టభద్రుల ఎలక్షన్స్ లో జనసేనపార్టీ పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక, త్వరలో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాయలసీమలో చేపట్టబోయే ‘జనవాణి’ కార్యక్రమంలో రాయలసీమ ప్రాంతంలోని ప్రధాన సమస్యలు లేవనెత్తే అంశాల గురించి చర్చించడం జరిగింది. అలాగే కార్యక్రమంలో రాష్ట్ర కార్యక్రమాల ప్రధాన కార్యదర్శి పి.భవాని రవికుమార్, రాప్తాడు ఇంచార్జ్ సాకే పవన్ కుమార్, తాడిపత్రి ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి, రాయదుర్గం ఇంచార్జ్ మంజునాథ్ గౌడ్, హిందూపురం ఇంచార్జ్ ఆకుల ఉమేష్, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి సాకే మురళీకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి, అంకె ఈశ్వరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శిలు దాసరి రామాంజనేయులు, కుమ్మర నాగేంద్ర, పత్తి చంద్రశేఖర్, అబ్దుల్, రాయలసీమ సంయుక్త మహిళ కమిటీ సభ్యులు పెండ్యాల శ్రీలత,. పసుపులేటి పద్మ, జిల్లా కార్యదర్శులు రాపా ధనుంజయ, ఇండ్ల కిరణ్ కుమార్ వాల్మీకి గౌతం, చంద్రశేఖర్, వాసగిరి మణికంఠ, ఏ.వి.రమణ, కె.సంజీవ రాయుడు, కోన చంద్రశేఖర్, బొగ్గరం శ్రీనివాసులు, లక్ష్మీ నరసయ్య, ఎం.ముత్యాలు, సంయుక్త కార్యదర్శిలు అవుకు నాగశెట్టి విజయకుమార్, పి.అనురాధ, బొమ్మల పురుషోత్తం రెడ్డి, హరికేరి జీవన్ కుమార్, బాల్యం రాజేష్, దూడి జయరామాంజనేయులు, డి.కె.జయమ్మ, ముప్పూరి కిష్ట, చిలుమత్తూరి వెంకటేష్, నాయకులు డేగల మహేష్ పాల్గొనడం జరిగింది.